10, జూన్ 2023, శనివారం

ఈ రోజు పద్యము

 186వ రోజు: (స్ధిర వారము) 10-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


వగవకు గడచిన దానికి 

బొగడకు దురాత్ములనెపుడు పొసగని పనికై 

యెగి దీనత నొందకుమీ 

తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!


 ఓ కుమారా! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము. 

 

ఈ రోజు పదము. 

మేక (Goat): అజ, అమేఢ,ఇడిక్కము, గళస్తని, చింబు,చుచ్చు,ఛగలి,ఛాగి, మేకము, సర్వభక్ష, హృద్య.

కామెంట్‌లు లేవు: