10, జూన్ 2023, శనివారం

కార్తెఅంటే

 *కాలములో- కార్తెఅంటే!ఏమిటి?* 

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<<                                       జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారం గా జాతకాలు, పంచాంగాలు తయా రు చేశారు. సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గర గా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడుఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరుపె  ట్టారు. కానీ తెలుగు రైతులుమాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగావ్యవసాయపంచాంగాలు తయారుచేసుకున్నారు. 

ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచా రు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గర గా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు.  


ఉగాది మొదలుకొని ప్రతి పదమూ డున్నర రోజులకొకసారి సూర్యుడు ఒక్కో నక్షత్రంలో ప్రవేశిస్తాడు.

 ఆ కార్తెను ఆ నక్షత్రం పేరుతో పిలు స్తారు. ఆప్రకారం సంవత్సరానికి 27 కార్తెలు. 

ఉదా:-సూర్యుడు,మృగశిరనక్షత్రంలో ప్రవేశించడమే మృగశిర కార్తె. తె లుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పా టిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు.తెలుగు రైతులు తర తరాలుగాతమఅనుభవాలలోనుంచి సంపాదించుకున్నవ్యవసాయవా తావరణ విజ్ఞానాన్ని 'కార్తెలు', వాటి పై సామెతల రూపంలో ప్రచారం చే శారు. ఆయా కార్తెలు నెలలు రాశు లు వారీగా పైరులకు వాతావరణం ఎలాఉంటుందోఅందరికీఅర్ధమయ్యే లా సామెతలలో చెప్పుకునే వారు .

రోహిణిలో రోళ్లు బద్దలవ్వడం,మృగ శిరలో ముసలిఎద్దు రంకెవేయడం. మొదలైన వాటి ద్వారా ఆయాకాలా లు ఎలా ఉంటాయో తర్వాతతరాల కు చెప్పేవారు.



        *సర్వేషాంశాన్తిర్భవతు.*

కామెంట్‌లు లేవు: