*మూఢం అంటే ఏమిటో తెలుసా? ఎందుకు మూఢం లో శుభ కార్యాలు చెయ్య కూడదు?!!*🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమికూడా ఓ గ్రహమే! భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే *అస్తంగత్వం* లేదా మూఢం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు. అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతుంటాయి. అందుకే దీనికి *మూఢం* అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతుంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది.గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని. కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిషశాస్త్రం ద్వారా తెలుస్తున్నది!! 👍👍👍👍👍👍 *మూఢంలో చేయతగినవి*
👍👍👍👍👍👍👍✊
అన్నప్రాసన చేసుకోవచ్చును.
ప్రయాణాలు చేయవచ్చును.
ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చును.
భూములు కొనుగోలు, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చును.
నూతన ఉద్యోగాల్లో చేరవచ్చును. విదేశాల్లో విద్య / ఉద్యోగం కోసం వెళ్ళవచ్చును.
నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చును.
జాతకర్మ, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చును.
సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు చేయవచ్చును. గర్భిని స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిథులలో అశ్విని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.👍👍👍👍👍👍👍👍👍👍👍
*మూఢంలో చేయకూడని పనులు!!*
వివాహాది శుభకార్యాలు జరుపకూడదు.
లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు.
పుట్టు వెంట్రుకలు తీయించరాదు.
గృహ శంకుస్థాపనలు చేయరాదు.
ఉపనయనం చేయకూడదు.
యజ్ఞాలు, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు , వ్రతాలు చేయకూడదు.
నూతన వధువు ప్రవేశం , నూతన వాహనం కొనుట పనికిరాదు.
బావులు , బోరింగులు , తవ్వించకూడదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి