🌱సంధ్యావందనఆవశ్యకత
"అహరహస్సంధ్యాముపాసీత"శృంగేరి శారదా దేవ్యై నమః.............
బ్రాహ్మణుడికి సంధ్యావందనము అనేది
" మాయ" నుండి కాపాడుటకు "ఆయుధము"
వలె ఉపయోగపడి క్రమముగ అరిషడ్వర్గముల బారి నుండి "ఆత్మరక్షణ" గావించి పురుషార్థములలో విజయమును చేకూరుస్తూ బ్రహ్మమును గురించి "ఆలోచన" చెయింపచేసి కైవల్యమును పొందుటకు కావలసిన "ఆత్మశిక్షణ"ను ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగియున్నది. కనుక
ఓవిప్రులార!
"ద్రుపదాదివముంచతు" ఇట్టి మంత్రముల పఠనముల వలన లొకంలో తప్పు చేయడం వలన "దోషి" కాళ్ళకు కట్టబడిన శృంఖలాల చేత ఏవిధముగఅయితే నడుచుటకు ఇబ్బంది పడుచుంటాడొ. అలాగే పాపకృత్యుడు కూడ పాపందొషం నుండి విడువబడని వాడు కూడ జ్ఞానమును పొందలేక అలాగే ఇబ్బంది పడతాడు.పాపజాతం నుండి విడువబడితేనే
కానీ. పుణ్యవంతుడు అవలేడు ఆతరవాతనే జ్ఞానార్హుడు అవగలడు.
అట్టిజ్ఞానికే కైవల్యం లభిస్తుంది.
"యాగ్ంసదాసర్వభూతానిచరాణిస్థావరాణిచ."
అనుట వలన బ్రహ్మచేత సృజింపబడిన ప్రతిపదార్థము కూడ సంధ్యాకాలం సంప్రాప్త మవగానే వాటివాటికి లభించిన మౌలిక సదుపాయములతో "సంధ్యను"ఆచరిస్తున్నాయి. "ఓంనమొభగవతెవాసుదేవాయ"
అనుటచెత
"కలౌనామస్మరణాత్ ముక్తిః"
అని శాస్త్రవచనానుసారం.
నామ సంకీర్తనం కూడ జరుగుచున్నది.
"ఆకాశాత్ పతితం తోయం యథాగఛ్ఛథిసాగరం.
సర్వదేవనమస్కారఃకేశవంప్రతిగఛ్ఛతి",
ఆకాశం నుండి జాలువారిన నీళ్ళు
సముద్రంలోకి చేరినట్లుగ .
ఎదేవతకి నమస్కారం చేసిన అది కేశవునకేచెందుతుంది.అనే ఆధ్యాత్మ విషయవిచారణ కూడ ప్రతినిత్యంఅభ్యాసంలొకివస్తూంటుంది.
ఈవిధమైన కర్మ,భక్తి,జ్ఞాన, విషయక మంత్ర సముచ్చయమైన సంధ్యావందనమును సకాలములో చేయుటకు ప్రయత్నించండి. మంత్రమును మననం చేస్తే అది మనలను (సృష్టినికూడ) రక్షిస్తుంది. ఇట్టి మహిమాతిశయ సమూహముతొ కూడియున్న సంధ్యావందనమును కనీసం అకాలమునందైననూ ప్రాయశ్చిత్త పూర్వకముగ అనుష్ఠానం చేసి జన్మసాఫల్యతను పొందవలెను..
కలియుగములో "ఆత్మోధ్ధరణం"
కావించుకొనుటకు ఇంతకంటే సులభమైన పరమధర్మము మరొకటిలేదు. శ్రౌత,స్మార్త,ఆగమాదులలో చెప్పినటువంటి ఏధర్మములను ఆచరించాలన్నా
"అర్హత" కల్పించి సార్థకత చేకూర్చగలిగేది
మనముందు ఉన్న సంధ్యావందనము
మాత్రమే అనిగుర్తించాలి...
....ముగింపు...
"సంధ్యాహీనోశుచిర్నిత్యఃఅనర్హఃసర్వకర్మసు"
సంధ్యావందనము చేయనివారికి అంతశ్శౌచం మరియు బహిఃశౌచం కూడ లేక పొవుట వలన అట్టివారు వైదిక మరియులౌకికకార్యములు రెండూకూడనిర్వర్తించుటకుఅనర్హులు.
...స్వస్తి.....
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి