10, జూన్ 2023, శనివారం

మధురంగా మాట్లాడు!

!


మధురంగా మాట్లాడు!


"కాకేమి తన్నుతిట్టెనె?

కోకిల తన్నేమి ధనము కోకొమ్మనెనే?

లోకము పగయగు పరుసని

వాకున,జుట్టమగు,మధురవాక్యమువలనన్"


        సంకుసాలనృసింహకవి-కవికర్ణరసాయనము.


          రాయలకాలంలపు నృసింహకవి ప్రబంధకవులకు దీటైనవాడు.అతడు మాంధాతృచరిత్రమును కవికర్ణరసాయనమను పేర మహాప్రబంధమును రచించి రాయలకంకిత మీయ విజయ నగరమునకరుదెంచెను.కారణమేమైననేమి?ఆమహాకవికి రాయలదర్శనము లభింపలేదు.నిరాశనిస్పృ హలేమిగిలినవి.

           ప్రస్తుత పద్యము మానవాళికి మంచిసందేశమందించు చున్నది.

కాకి కొట్టిందా?కోకిలపెట్టిందా?కాకికూతకు తిట్టుకుంటాం.కోకిలకూతను మెచ్చుకుంటాం.కారణం?

"పరషంగామాటలాడితే లోకమంతా పగయౌతుంది(అందరకూదూరమౌతావు) తీయగా మాటలాడితే అందరికీ చుట్టంగా మారుతావు.కనక,


" మధురంగా మాటలాడటం నేర్చుకో!"

మానవత్వానికి చేరువగా ఉండటం అలవరచుకో!"-అని;

                                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷👌

కామెంట్‌లు లేవు: