#సుధామూర్తి
కార్యక్రమాల్లో... వెజ్ , నాన్ వెజ్ కి సెపరేట్ గరిటలనీ కూడా ఉంచితే బాగుంటుందీ.. అని సుధామూర్తి గారు ఓపెన్ గా చెప్పడాన్ని పూర్తి శాఖాహారులు లక్షల్లో పూర్తిగా ఏకీభవిస్తారు..శాకాహారులకు సమాజంలో ఉండే ఇబ్బందుల గురించి.. అనుభవాలతో కూడిన వివరణ చదవండి
పూర్తి శాకాహారులు.. బయట ఆహారం తినేందుకు ఇష్టపడరు.. ఒకవేళ బయట తినాల్సి వస్తే , వెజ్ , నాన్ వెజ్ కలిసి ఉండే హోటల్స్ వైపు కన్నెత్తి చూడరు.. పూర్తి శాఖాహార హోటల్ లో తినడానికె ఇష్టపడతారు..
రెండూ కలిసి ఉండే చోట తింటే ఏమవుతుంది? అనే సందేహం చాలామందికి వస్తుంది.. అటు నాన్ వెజ్ వడ్డించేందుకు వాడిన గరిటలతోనే... ఇటు వెజ్ పాత్రలలో కూడా వాటినే ఉపయోగించి, వడ్డిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం..
అలా కాకుండా..
వారంలో 6 రోజులు శాకాహారం తిని , ఒకరోజు నాన్ వెజ్ తినే వారికి.. తేడా ఏం తెలీదు.. గరిటే లో ఏముందిలే అనేసుకుంటారు..
కానీ అసలు మాంసాహారం తినని, పూర్తి శాకాహారులకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది
పూర్తి శాఖాహారం అలవాటు ఉన్నవారి ఇళ్ళలో .. నూటికి 75% ఉల్లి , వెల్లుల్లి నిషిద్ధం.. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు.. ఉల్లి, వెల్లుల్లి కూడా శాకాహారమే కదా.. అని... వాడుతూ ఉన్నారు.. కాలానుగుణంగా పరిస్థితి వలన కొందరు మారడం సహజం..
కొందరు వెల్లుల్లి ఘాటు మోతాదుకు మించి ఉంటే తినలేరు.. సరికదా.. ఆ వాసన కూడా వెగటుగా ఉండి తలనొప్పి కూడా వస్తుంది..
దేవాలయాల్లో వంటకు సాధారణంగా వెల్లుల్లి వాడరు కదా .. గానీ ఓ తమిళనాడు దేవాలయంలో పెట్టిన అన్నం లో చింతపండురసంతో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకోగానే .. వెల్లుల్లి వేయడంతో ఆ ఘాటు కు కడుపులో తిప్పేసి సాయంత్రం దాకా వికారం తోనే ఉండాల్సి వచ్చింది.. ఎప్పుడన్నా వెల్లుల్లి తినే అలవాటు ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే.. అసలు అవి... వాడనివారికి..
అందునా... మాంసాహారం అనేదే తెలీని శాకాహారికి.. ఆ వాసన ఇంకెంత... ఇబ్బందిగ ఉంటుందో.. అర్ధం చేసుకోండి..
చాలామంది మాంసాహారులు వంటల్లో ఇంగువ వాడరు.. ఇంగువ వేసిన పచ్చడి తిన్నా , చారు తిన్నా నోరు పాడయింది.. ఛీ.. అంటూ ఉంటారు.. ఎందుకంటే వారికి ఇంగువ అలవాటు లేకపోవడం వల్ల.. ఆ రుచి నచ్చక, వాసన పడక.. ఇబ్బందిగా ఉంటుంది.. ఇంగువ పోపుతో చేసిన చారు తిని కక్కేసిన వారిని కూడా ఉంటారు.. వారికి ఇంగువ ఎలాగో.. వీరికి... మసాలాలు.. నాన్ వెజ్ లు .. అలాగే వికారం చేస్తాయి మరి..
ఎవరన్న తినేటప్పుడు..నాన్ వెజ్ తినేవారు పక్కనే కూర్చున్నా. లేదా పక్కింట్లో ఎవరన్న వండేప్పుడు.... కూడా.. ఆ వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.. మాంసాహారం తినేవారికి ఈ ఇబ్బంది ఏంటో అర్ధం కాపోవచ్చు.. కానీ.. ఆ వాసన కూడా ఆలవాటులేనివారికి... అదెంత ఇబ్బంది అనేది.. పడేవారికి మాత్రమే తెలుస్తుంది..
శాకాహారుల్ని స్కూల్స్ లో.. కాలేజెస్ లో.. టీజ్ చేయడం చాలామందికి తెలీదు ఏమో... అవి కూడా భరించిన అనుభవాలన్నీ ఇప్పుడు చెప్పలేం.
ప్రయాణాలలో శాఖాహారం ఆహార అలవాట్ల వల్ల చాలా ఇబ్బందులే ఎదుర్కొంటూ ఉంటాను.
నాకు ఇష్టమైన శాకాహారాన్ని నేను స్వీకరించే విషయంగా ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొన్నాను. అయినా నా అలవాటు మార్చుకునే ప్రసక్తే లేదు..
"మీ కులం వారు చాలామంది తింటారే?" అని నవ్వుతూ అడుగుతూ (నీకేం పోయేకాలం? అని మనసులో )
"ముక్క రుచి ఒకసారి చూస్తే వదలవు తెలుసా "
"మీ పప్పు తిని ఎలా బ్రతుకుతారు అసలు "
"శాకాహారి గా ఉన్నావంటే నమ్ముతామా, రావమ్మా తిందువు గానీ"
"మేక శాకాహారే! మేక తో వండాం తిందువు రా "
సమాజంలో భోజనం టైం లో ఎదుర్కొన్న అనేక మాటలు
నా ఆహారం ... నా ఇష్టం...నేను నాకు ఇష్టమయిన... అలవాటు అయిన శాఖాహారం మాత్రమే తింటాను..
ఫైనల్ గా... చెప్పొచ్చేదేంటంటే..
సమాజం మారుతుందో.. మారదో తర్వాత సంగతి..
ఒకరి ఇబ్బందిని వ్యక్తం చేస్తున్న కూడా.. అదేదో గొప్పతనం గా చెప్పేవారికి పెద్ద 🙏.
ఈ ఒక్క ఆహార విషయంలో ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలకే దూరంలో ఉంటూ ఉండటం కూడా మనం చూస్తూనే ఉంటాము. అసలు మనమొక పండుగ చేసుకుంటూ ఉంటే అనేక జీవరాశుల కు ప్రాణహాని కలిగించడం న్యాయమా అని కూడా ఆలోచించకుండా, మనతో బాటు ఉండే మూగప్రాణులు కూడా సంతోషించి ప్రకృతి ఆనందించే విధంగా మన కార్యక్రమాలు నిర్వహించుకోలేమా!!?? మన సంతోషం కోసం కొన్ని జీవుల ప్రాణాలను తీయడం సమంజసమా!!?? అని ఆత్మ విమర్శ చేసుకుంటే మనతో మన మిత్రులు, సాటి జీవరాశులు అన్నీ సంతోషం గా కలిసి మెలిసి ఆనందం పంచుకునే అవకాశం ఉంటుంది కదా!!
సర్వేజనాస్సుఖినోభవంతు...
స్వస్తి...
#I_support #sudhamurthi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి