🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 47*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*సిద్ధుల తిరస్కృతి*
ఒక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి విడిగా పంచవటికి తోడ్కొనిపోయి
అతడితో, "ఇలా చూడు, ఏళ్ల తరబడి నేను చేసిన తపఃఫలంగా నాకు అణి మాది అష్టసిద్ధులు లభించాయి. కాని బట్ట జారిపోకుండా చూసుకోలేని నా లాంటి వ్యక్తికి వీటిని ఉపయోగించుకోవడానికి తీరిక ఎక్కడ? తన అనేక కార్యాలను నువ్వు చేయబోతున్నావని జగజ్జనని నాతో చెప్పింది. కనుక ఆమెకు విన్నవించి ఆ సిద్ధులను నీకు ఇవ్వగోరుతున్నాను. ప్రస్తుతం నువ్వు పుచ్చుకొంటే అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఏమంటావు?" అని అడిగారు.
నరేంద్రుడు కాసేపు యోచించిన తరువాత, "మహాశయా! భగవదనుభూతిని పొందడంలో ఇవి నాకు ఉపకరిస్తాయా?" అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, "ఉపకరించవు. భగవదనుభూతికి ఉపకరించకపోయినా, భగవత్సాక్షాత్కారానంతరం భగవత్కార్య నిర్వహణలో ఇవి ఎంతో ఉపకరిస్తాయి" అన్నారు. తక్షణమే నరేంద్రుడు, "అలా అయితే ఈ సిద్ధులతో నాకు ప్రయోజనం లేదు.
మొదట భగవదనుభూతి కలుగనివ్వండి, ఆ తరువాత వాటిని స్వీకరించాలో వద్దో నిర్ణయించుకొంటాను. అద్భుత శక్తులను ఇప్పుడే స్వీకరించినందువలన లక్ష్యాన్ని విస్మరించి, స్వార్థంతో దుష్ప్రేరణకు లోనై వాటిని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటప్పుడు అంతా వ్యర్ధమయిపోతుంది కదా!" అని జవాబిచ్చాడు. శ్రీరామకృష్ణులు నిజానికి ఆ దివ్యశక్తులను నరేంద్రునికి ఇవ్వాలనుకొన్నారా లేక నరేంద్రుని మనోవైఖరిని పరీక్షించదలచారా? ఏది ఏమైనప్పటికీ నరేంద్రుడు వాటిని తిరస్కరించడం, శ్రీరామకృష్ణులకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందనడం మాత్రం నిజం.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి