23, సెప్టెంబర్ 2023, శనివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 30*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 30*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి రణిమాద్యాభిరభితేః*  *నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః |*

*కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతేః*

 *మహాసంవర్తాగ్ని ర్విరచయతి నీరాజనవిధిమ్ ‖*


జీవ బ్రహ్మైక్య ప్రతిపాదన చేస్తున్నారు ఈ శ్లోకంలో.


అమ్మా


స్వదేహోద్భూతాభిః = నీ శరీరం నుండి వెలువడుతున్న


ఘృణిభిః = కిరణములు


అణిమాద్యాభిరభితః = అణిమాది సిద్ధులు

  ఇవి


నిషేవ్యే= నిన్ను సేవిస్తున్నాయి.


*అణిమాదిభిరావృతామ్ మయూఖైః* అని అమ్మవారి నామం.


నిత్యే = నిత్యమైన తల్లీ


త్వామహమితి = నీవే నేనని నీలో వున్న చిచ్ఛక్తియే కదా నాలో చైతన్యముగా వుండి నన్ను జీవింపజేస్తున్నది.


సదా భావయతి యః = ఎవడు సదా భావిస్తాడో

*అహమిత్యేవవిభావయే భవానీం* అని అమ్మవారి నామాలు.


తస్య త్రినయన సమృద్ధిం తృణయతః = ముక్కంటివాడి సంపదను (ముల్లోకాల సంపదను) కూడా తృణప్రాయంగా చూస్తాడు.


మహాసంవర్తాగ్నిః =  మహా ప్రళయకాలంలో ఉద్భవించే బడబాగ్ని కూడా


విరచయతి నీరాజనవిధిమ్ = అట్టి యోగికి నీరాజనం పడుతుందమ్మా!


కిమాశ్చర్యం = ఆశ్చర్యం ఏముంది? అంటే ఇది తథ్యము అని.


 అణిమాది అష్ట సిద్ధులు ఏమిటి అంటే 


అణిమ = శరీరాన్ని అణువంత చేయటం 


మహిమ = శరీరాన్ని అనంతముగా పెంచటం 


గరిమ = శరీరాన్ని విపరీతంగా బరువు పెంచివేయటం 


లఘిమ = శరీరాన్ని దూదిపింజ వలె తేలిక చేయటం 


ప్రాప్తి = కోరుకున్న ఏ ప్రదేశానికైనా అనాయాసంగా వెళ్లగలగటం 

ప్రకామ్య = కోరుకున్నదేదైనా సాధించగలగటం   

ఈశిత్వ = తిరుగులేని ప్రభుతను (అధికారాన్ని) పొందగలగటం


వశిత్వ = అందరినీ తన వశంలో ఉంచగలగటం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: