2, ఆగస్టు 2021, సోమవారం

ధర్మం భగద్గీత

 "ధర్మం " అనే పదాన్ని ఇతర పాపపుణ్యాల భావములకు అన్వయించకూడదు. భగద్గీత అనుసరించి "ధర్మం " అనగా:


"ధర్మం " అంటే స్వధర్మ కర్మాచరణే . చాతుర్వర్ణం మయాసృష్ఠం వాసుదేవుడు అన్నాడు కాబట్టి ఆయన తన సృష్టి అనే కార్యాలయములో గుణ,కర్మ విభాగాలననుసరించి నాలుగు వర్ణాలు లేక పరంపర ని ఏర్పరుచుకున్నాడు. సృష్టిలో దేవతలు, మానవులు ప్రముఖ పాత్ర పోషిస్తారు. మానవులకు యజ్ఞాలతో వర్షాలు కురిసి ఆహారము పొంది , వర్షాలకు కారణమైన దేవతలకు హవిస్సులు ఇచ్చి మిగిలిన శేషం తినమన్నాడు . తనకు తానే వండుకు తినువాడు దొంగతో సమానము . హవిస్సులు పొంది దేవతలు సంతోషంతో వర్షాలు ఇస్తారు. 

తన సృష్టి అనే కార్యాలయములో యజ్ఞం నిరాటంకముగా కొనసాగుటకు నాలుగు వర్ణాలు తమవంతు పాత్ర నిర్వహించాలి . బ్రాహ్మణుడు యజ్ఞం హోత . 

క్షత్రియుడు యజ్ఞ రక్షణ . వైశ్యుడు యాజ్ఞవస్తువుల సరఫరా. శూద్రుడు యజ్ఞ నిర్వహణలో పై మూడు నిర్వహకులకు దేహశక్తి సహాయం అందించాలి. 

అదే ఏర్పాటు . ఈ నిర్వహణలో మరణము సంభవించినను స్వర్గతుల్యమే. ఎవరు తమ పాత్ర తక్కువని ఇతర పరంపర/వర్ణం ఆకర్షణమైనదని భావించి అటువైపు దృష్టి మళ్ళి వెళ్లారో వారికి ఇహంలోనూ పరంలోను దుర్గతి. 

ఇంకొక సందేహం రావచ్చు ఒక వర్ణములో జన్మించినవాడు భ్రష్టుడైతే అతని పునర్జన్మ కర్మ, గుణానుసారముగా మానవుణ్ణి నుంచి క్రిమి కీటకాదులవరకు కలుగవచ్చు. శుభమ్ భూయాత్త్.

కామెంట్‌లు లేవు: