2, ఆగస్టు 2021, సోమవారం

పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు

 🙏🙏🙏🙏🙏

🌼🌼🌼🌼🌼

పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు

గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి. 


ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడం చేయి పూజా విధులలో నిషేధం. 


ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. 

    

ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు. 

🌼🌼🌼🌼🌼

🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: