2, ఆగస్టు 2021, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 17

  ప్రశ్న పత్రం సంఖ్య: 17                 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి   

1) శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో వున్న "అష్టదిగ్గజాల" పేర్లు ఏమిటి 

2)సంస్కృతంలో  పంచ కావ్యాలు ఏవి .   

3) క్రింది ఖాళీలను పూరించండి 

_________నాస్తి దుర్భిక్షం!

జపతో నాస్తి ______ !
మౌనేన ________ నాస్తి!

నాస్తి _________భయః!! 

4)  సాధారణంగా ఒక పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. కానీ కొన్ని దేశీయ ఛందస్సులో చాలా పాదాలు ఉండవచ్చు ఆ ఛందస్సులు తెలపండి. 

5) అతిశయోక్తి అలంకారం  అంటే ఏమిటి. 

6)"తెగేదాకా లాగకూడదు" అని ఏ సందర్భంలో ఉపోయోగిస్తారు.  

7)శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంధము ఏమిటి. 

8) తెలుగు పంచ కావ్యాలు ఏవి 

9)  " ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు" అని ఎప్పుడు ఉపోయోగిస్తారు

10) త్యాగరాజు వ్రాసిన పంచ రత్న కీర్తనలు ఏవి 

11) మన దేశంలో ఎన్ని రకాల సంగీత పద్ధతులు వున్నాయి 

12) లంకను కాపలా కాసేది ఎవరు. 

13) వసుదేముడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు. 

14) హనుమంతుడు ఎన్ని వ్యాకరణల పండితుడు 

15) "కుమారసంభవం" వ్రాసిన కవి ఎవరు 


కామెంట్‌లు లేవు: