17, జులై 2022, ఆదివారం

లయ - లయం

 లయ - లయం 

  లయ - లయం ఈ రెండు పదాలు చూడటానికి కొంత సామ్యంగా వున్నా ఒకదానికి ఇంకొకటి భిన్నంగా మాత్రమే కాదు వ్యతిరేకంగా కూడా గోచరిస్తాయి..  ఈశ్వరుడిని మనం లయకారకుడు అని అంటాము అంటే లయం చేసేవాడాని వినాశకారకుడని మనం  భావిస్తాము. ఒకవిషయం త్రిమూర్తులకు లేని ఒక ప్రత్యేకత ఈశ్వరునికి వున్నది ఏమిటంటే మూడవ కన్ను.  ఈశ్వరుడు మూడవకన్ను తెరిచాడంటే సర్వం భస్మమే. ఈశ్వరుడు భస్మధారి అంటే భస్మాన్ని పూసుకునే దేముడు.  చివరకు అంతా భస్మమే అని చెప్పటమే కావచ్చు దాని అంతరార్ధం. ఈశ్వరుడు లయకారుడు అంట లయకు కూడా ఆయనే కారకుడు.  అందుకే ఈశ్వరుని నటరాజ స్వామిగా మనం కొలుస్తాము. 

ఈ జగత్తుని ఒకసారి పరిశీలిస్తే మనకు రెండు విషయాలు  బోధపడతాయి. ఒకటి లయ అంటే ప్రతిదీ ఒక లయ ప్రకారం గోచరిస్తుంది. మన హృదయం ఒక లయ ప్రకారం స్పందిస్తుంటుంది. మన ఉచ్వాస, నిశ్వాస కూడా ఒక లయకు ప్రతీకే నీవు నడిచేటప్పుడు వేసే అడుగులు కూడా లయప్రకారమే ఉంటాయి. లయతోటె లయం కూడా జరుగుతుంది.  అందుకేనేమో లయప్రకారం వేగంగా వట్టిదిగా అడుగులు వేసే సైనికులను సైనికాధికారి వంతెనమీదనుండి వెళ్ళేటప్పుడు విడి విడిగా నడవమని ఆదేశాన్ని ఇస్తాడు.  కాకపొతే వత్తేన ధ్వంసం కాగలదు. 

జీవితంలో ప్రతిదీ లయప్రకారమే జరుగుతుంది. పెరుగుదల చుస్తే అందులో కూడా నీకు లయ అనిపిస్తుంది. ఒక మొక్కను రోజు గమనించి చుడు అది ఒక లయప్రకారం అభివృద్ధి చెందుతుంది.  తరువాత పూలు, కాయలు మరియు పండ్లు అన్ని లయప్రకారమే జరుగుతాయి.  వాటిని పరిశీలించి చుస్తే ఈ విషయం బోధపడుతుంది.  చివరకు పండిన పండుకూడా ఆ చెట్టుకు ఎంతకాలం అట్టి పెట్టుకొని ఉండాలో అంతకాలం ఉండి చివరకు రాలి పడుతుంది.  అంతా లయ కనపడుతుంది. ఎక్కడైతే లయ ఆగిందో అదే లయంగా మనకు గోచరిస్తుంది. 

మానవ జీవితంకూడా ఒక చెట్టుకన్నా, లేక లతకన్నా భిన్నంగా ఏమిలేదు.  కేవలం నీవు గమనించాలి ఎప్పుడైతే నీవు ఈ దృగ్గోచరాన్ని గమనిస్తావు అప్పుడు నీకు సుస్పష్టం అవుతుంది. లయ ఉన్నంతవరకే జీవితం.  తరువాత లయమే. 

కాబట్టి మిత్రమా నీకు భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే లయను పూర్తిగా ఈశ్వరుని పరం చేస్తే చివరికి లయం అయినతరువాత మోక్షం సిద్ధిస్తుంది. 

ఈ జీవితం పూర్తిగా ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన ఒక వరంగా భావించి ప్రతి కర్మలోను భగవంతుని చూసి అన్ని కర్మలను ఎప్పుడైతే సాధకుడు ఈశ్వరునికి సమర్పణ చేస్తాడో అప్పుడు సాధకుడు మోక్షార్హుడు అవుతాడు చివరకు మోక్షాన్ని పొందుతాడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

కామెంట్‌లు లేవు: