17, జులై 2022, ఆదివారం

మానవ జన్మ:

 

మానవ జన్మ:

( ఇది కేవలం 60 సంవత్సరాలు నిండిన పురుషులను ఉద్దేశించి వ్రాసింది.  మిగిలినవారు చదవటం నిషిద్ధం)

మిత్రులారా 84 లక్షల జీవరాశులలో మనిషి కూడా ఒక జీవి. అటువంటి మానవజన్మ ఈనాడు మనకు లభించింది. అందునా మగవాడుగా పుట్టటం ఇంకా శ్రేష్టం (ఇక్కడ స్త్రీలు తక్కువ వారని కాదు స్త్రీలకు పురుషులతో పోలిస్తే అనేక ఇబ్బందులు ఉంటాయివారి శరీరం సున్నితం, సుకుమారం గా ఉండి ఉంటుంది కాబట్టి పురుషులు చేయగలిగే కఠినమైన పనులు వారు చేయలేరు. జ్ఞానసాధన అంటేనే ఎంతో నిష్ఠతో, కఠినమైన తప్పస్సుతో ఆచరించవలసింది. కాబట్టి అది స్త్రీల కంటే పురుషులు కొంతవరకు సాదించటానికి శరీరం  సహకరిస్తుంది. ఐనా అనేకమంది స్త్రీలు తమ అకుంఠిత భక్తితో పాతివ్రత్యం తో మోక్షం పొందినట్లు మన పురాణ,ఇతిహాసాలు తెలుపుతున్నాయి) ఇప్పుడు మీరు 60 సంవత్సరాల వయస్సు గడిపి జీవితంలో చివరి అంకంలో వున్నారు.అంటే  శని దేవుడు మీ జాతక చక్రంలో రెండు భ్రమణాలు చేసి వున్నారు. నాలుగు భ్రమణాలు చేయడం అనేది నాకు తెలిసి శ్రీ రామానుజ చార్యులు వారికి మాత్రమే జరిగింది ఆచార్యులు 120 వసంతాలు జీవించినట్లు చరిత్ర చెబుతున్నది. (జ్యోతిష శాస్త్ర రీత్యా శని దేవుడు మారక కారకుడు అంటే మారక స్థానంలో శని ప్రవేశిస్తే జాతకునికి మారకం (మరణం) సంభవిస్తుందని శాస్త్ర  ఉవాచ. జాతక చక్రంలో అతి తక్కువ వేగంతో చలించే గ్రాహం శని శని ఒక సారి తను ఉన్న గది నుండి భ్రమించి తిరిగి అదే స్థలానికి రావడానికి 30 సంవత్సరాల సమయం పడుతుందికొందరు 30 సంవత్సరాల కన్నా ముందే చనిపోతారు అంటే శని మొదటి భ్రమణంలో మారకాన్ని ఇచ్చాడన్నమాట. అతి ఎక్కువగా శని దేవుడు 4 సార్లు జాతకుని జాతకచక్రంలో తిరుగగలడు అంటే 30 x 4= 120 సంవత్సరాలు అతి దీర్ఘ ఆయుష్షు ) అతి దీర్ఘ ఆయుష్షు అతికొద్ది మంది జాతకంలో ఉంటే ఉండవచ్చు కానీ అది చాలా దుర్లభము. 60 దాటినాయి అంటే క్షణంలోనైనా పిలుపు రావచ్చుమీరు నేను అనుకున్నది దేహం అని అనుకుంటున్నారా అయితే అది మిధ్య క్షణంలో నయినా అది రాలిపోవచ్చు  అది కేవలం ఈశ్వరునికి ఎరుకమనం మన అజ్ఞానంతో రేపు అది చేస్తా రేపు ఇది చేస్తాం అని ఐహికమైన వాంఛల మీద మనస్సు లగ్నం చేస్తూ ఈశ్వరుని మరుస్తున్నాంమీరు ఆనందంగా 60 సంవత్సరాలు గడిపారు ఇక మీదనన్న మిగిలిన శేష జీవితాన్ని పరమేశ్వరుని సాన్నిధ్యంలో గడిపి జన్మ సార్థకం చేసుకోవాలని యోచించండిఅదే మనకు పరమేశ్వరుడు ఇచ్చిన  సువర్ణావకాశం. అవకాశం కనుక సరిగా వినియోగించుకో పోతే మరల ఎన్ని జన్మలకు తిరిగి అవకాశం వస్తుందితిరిగి మానవజన్మ ఎత్తాలంటే అవకాశం (PROBABILITY ) 84 లక్షలు ఇష్టు ఒకటి అంటే మీరు ఆలోచించండి. ఐహిక వాంఛలతో, భోగ విలాసాలతో అపురూపమైన మానవ జన్మను వృధా చేస్తే చివరికి మీకు మిగిలేది నిరాశ మాత్రమే "పునరపి జననం పునరపి మరణం" మరల మరల పుట్టి చనిపోతూ ఉండటమే. కాబట్టి భార్గవ శర్మ మాట విని మిత్రమా ఇప్పుడే మేల్కొని నీ గమ్యాన్ని తెలుసుకో. మిగిలిన జీవకోటికి మనిషికి ఉన్న తేడా ఒక్కటే మనిషికి బుద్ది వున్నది మిగిలిన జంతువులకు బుద్ది లేదు.  కాబట్టి మేధావి అయిన మనిషి తన బుద్దిని ఉపయోగించి తాను ఈ జన్మ ఎందుకు ఎత్తానా అని యోచిస్తే తన జన్మకు సార్ధకత ఏమిటా అని అనిపిస్తుంది.  మన మహర్షులు ఒక్కటే చెప్పారు అదే జన్మరాహిత్యం అంటే మోక్షం.  సాధకుడు తన శక్తితో బ్రహ్మ జ్ఞనాన్ని పొందాలి.  తత్ ద్వారా మోక్షాన్ని పొందటమే జీవన సాఫల్యం.  కాబట్టి మిత్రమా ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

 


కామెంట్‌లు లేవు: