17, జులై 2022, ఆదివారం

శ్రేయస్సు* కోరేవారితో

 *ఆదివారం --: 17-07-2022 :--*


      మన జీవితంలో అత్యంత *శక్తి* వంతమైనది మన *ఆలోచన* ఇది మన *జీవితంలో* ఎలాంటి పరిస్థితినైనా *మార్చ* గలదు ఒకరి జీవితంలో మనం ఎంత *ముఖ్యం* అనేది వారు *మనకు* కేటాయించిన *సమయాన్ని* బట్టి *మాటల తీరుని బట్టి* తెలుస్తుంది .


     చెడ్డవారితో *స్నేహం* చేసి *గౌరవం* పొందలేము ఎలాగంటే *బురద* నీటితో *స్నానం* చేసి *శరీరాన్ని* శుభ్రం చేసుకోలేము *కదా !* అందుకే మీ *శ్రేయస్సు* కోరేవారితో మాత్రమే *చెలిమి* కొనసాగించండి నీకు *కీడు* చేసే వారి స్నేహాన్ని *తిరస్కరించండి* మనకు అప్పుడప్పుడు మన *ఇష్టాలు* మారుతుంటాయి *కానీ* మనలో ఉన్న *ప్రేమ* మాత్రం ఎప్పటికి మారకూడదు మనకు *కష్టాలు* వస్తుంటాయి ఐనాసరే *నమ్మకం* కోల్పోకూడదు మనం అప్పుడప్పుడు *మాట్లడే మాటలు* మారుతుంటాయి *కానీ* ఇచ్చిన *మాటను* మరువకూడదు .


     నీవు చేసే *ప్రయత్నం* ఎప్పటికి *వృదాకాదు* వైఫల్యం *శాశ్వతంగా* ఉండవు కొన్ని సార్లు చిన్న *ప్రయత్నమూ* నీకు ఉన్నత *స్థానాన్ని* కల్పిస్తుంది ఒక *మాట* భయంకరమైన *మౌనాన్ని* తరిమివేస్తుంది ఒక్క చిన్న *చిరునవ్వు* అనంతమైన *దుఃఖాన్ని* చేరినీవేస్తుంది .


     *మీ ... ప్రొద్దుటూరి రవిందర్ గుప్త*

కామెంట్‌లు లేవు: