17, జులై 2022, ఆదివారం

హిందూమతం

 సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. 


ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుల రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండి శంకరులు ఉదహరించారు. స్వానుభవానికి శంకరులు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుల రచనలు మూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు.


గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.


శ్రీ మహా గణేశ పంచ రత్నమ్ :


ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం |

కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం |

నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ‖ 1 ‖


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం |

నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం |

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ‖ 2 ‖


సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం |

దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం |

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ‖ 3 ‖


అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం |

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం |

కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ‖ 4 ‖


నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ |

అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ |

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం |

తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ‖ 5 ‖


మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహం |

ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ |

అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం |

సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ‖


సేకరణ

కామెంట్‌లు లేవు: