17, జులై 2022, ఆదివారం

బాంధవ్యాలు

*బాంధవ్యాలు*

అరటిపండును తొక్క తీసేసి తింటాం.

సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.

సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని పై తొక్కతో పాటు లోపలి గింజలు కూడా వదిలేస్తాం.

ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.

జామ పళ్ళని మొత్తం తినేస్తాం.

ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.

ఒక్కోటి ఒక్కో రుచి. తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే. 

అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే. 

అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.

కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి, అన్న, తమ్ముడు అందరూ ఒక్కో రకం పండు లాంటివారు. ఒకొక్కరిది ఒక్కో స్వభావం. అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే. అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. 

పండులో అక్కర్లేని గింజ, తొక్క, తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!! కొన్ని పండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు. వాటి జోలికి పోకుండా వదిలేస్తాం తప్ప చిరాకుపడం కదా!!?

పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం. ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.

కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!కుటుంబ స్థితిగతులను అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ
శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ !!

సర్వే జనా సుఖినోభవంతు🙏🙏🙏

కామెంట్‌లు లేవు: