24, డిసెంబర్ 2023, ఆదివారం

గీతా జయంతి

 *ॐ                గీతా జయంతి* 


                        *సందేశం - 2* 


*  *వాదించువారిలో వాదించు శక్తి నేనే.*

   *"వాదః ప్రవదతామహమ్"* 


       *I am the logic among controversialists.*  

          *- Bhagawadgeetha 10/32* 

 

*వివరణ*  


    *ఒక్కొక్కడు ఒక్కొక్క విషయాన్నిగూర్చి వాదిస్తాడు.* 

* *ఒకడు తన నమ్మకాలని గూర్చి వాదిస్తాడు.*  

* *ఒకడు తన కోరికలని గూర్చి వాదిస్తాడు.* 

* *ఒకడు తనకు వ్యామోహమున్న వస్తువులను గూర్చి వాదిస్తాడు.*  

* *ఒకడు తాను సత్యమనుకొన్నదానిని గురించి వాదిస్తాడు.* 

    *ఎవడు దేనిని గూర్చి వాదిస్తాడో, వాడక్కడ నుండి బయలుదేరి, అంతర్యామిని అనుభవించదానికి ప్రయాణం కడుతున్నాడు.* 

    *వాదించుచున్నది తానే కనుక, వాదన నుండి బయలుదేరి, వాదించుచున్న తన వద్దకు చేరుకుని, అందలి తనను తెలుసుకొని, ఈ మొత్తం తానే అని దర్శిస్తాడు.*  

    *కాబట్టి వాదించు వారిలో వాదించు శక్తి దేవుని వైభవము.*  


    *వాదము "వాద - జల్ప - వితండ" అని మూడు విధాలు.*  


*1. రాగద్వేషాలు లేకుండా, కేవలం తత్త్వాన్ని తెలుసుకొనే అభిలాషతో చేయబడే ప్రశ్నోత్తరాలని "వాదము" అంటారు.* 


*2. పరులు ప్రతిపాదించిన విషయాలను ఖండించి, తన ప్రతిపాదిత విషయాలను స్థాపించుకొని, ఇతరులని జయించాలని చేసే ప్రసంగం "జల్పం" అనబడుతుంది.*  


*3. కేవలం పరుల ప్రతిపాదిత విషయాలను దూషించు ఉద్దేశ్యంతో చేయబడేది "వితండం".* 


    *By the word "controversialists", we should here understand the various kinds of people using various kinds of argumentation in logic such as "Vada, Jalpa and Vitanda".* 


*1. Vada is a way of arguing by which one gets at the truth of a certain question.* 

     *The aspirants who are free from Raga - Dvesha and jealousy raise amongst themselves questions and answers and enter into discussions on philosophical problems in order to ascertain and understand the nature of the Truth.* 

    *They do not argue in order to gain victory over one another. This is Vada.* 


*2 Jalpa:*  

      *Jalpa is wrangling in which one ascerts his own opinion and refutes that of his opponent.* 


*3. Vitanda:* 

      *Vitanda is idle carping at the arguments of one's opponents.*  

      *No attempt is made to establish the other side of the question.* 


       *In Jalpa and Vitanda one tries to defeat another. There is desire for victory.* 


                    *=x=x=x=* 


    *— రామాయణం శర్మ*  

             *భద్రాచలం*

కామెంట్‌లు లేవు: