శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
మహానుభావులారా ! శ్రుతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నాను. వినండి. ప్రేమభావాన్ని
చంపుకుని తండ్రి అమ్మేసి ధనం తీసుకున్నాడు కనక ఇతడికి అజీగర్తుడితో సంబంధం ఆ క్షణంతోనే
తెగిపోయింది. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే కానీ బలి ఇవ్వడానికి నిర్దయగా యూపానికి కట్టేశాడు కనక
అతడూ తండ్రి కాడు. స్తుతులకు సంతోషించి వరుణుడు విడిపించాడు. అంతేకానీ ప్రేమతోకాదు.
మహామంత్రాలతో ఎవరు స్తుతించినా ధన ప్రాణ రాజ్యాలనేకాదు మోక్షాన్ని కూడా దేవతలు ఇస్తూనే
ఉంటారు. స్తోత్రప్రియులైన మానవులూ ధనధాన్యాదులను ఇవ్వడం, ప్రాణాలు నిలబెట్టడం ఉంది.
అంతమాత్రాన వారు తండ్రులు కారు. అతి సంకట పరిస్థితిలో కేవల వాత్సల్యంతో మహామంత్రాన్ని
ఉపదేశించి రక్షించాడు కనక కౌశికుడే తండ్రి అని ప్రకటించాడు. సభాసదులంతా సమ్మతించారు.
వెంటవే కౌశికుడు ప్రేమగా శునశ్శేపుడి కుడిచెయ్యి అందుకున్నాడు. పుత్రకా! ఇంటికివెడదాం, పద
అన్నాడు. అందరికీ వీడ్కోలు చెప్పి శునశ్శేపుణ్ణి తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఋత్విక్కుల సభ్యులూ కథ సుఖాంతమయ్యిందని సంతోషిస్తూ ఎవరి ఇళ్ళకు వారు
వెళ్ళిపోయారు. హరిశ్చంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన సాగిస్తున్నాడు.
ఈ వృత్తాంతమంతా తెలుసుకుని రోహితుడు నిర్భయంగా రాజధానికి తిరిగివచ్చాడు. తండ్రికి
పొష్టాంగపడ్డాడు. శ్చంద్రుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. ఒడిలో
కూర్చుండబెట్టుకుని నులివెచ్చని ఆనంద బాష్పజలధారలతో కొడుకు శిరస్సును ముంచెత్తేడు. ఆ
రోహితుడికి పట్టాభిషేకమయ్యింది. అప్పటినుంచీ అయోధ్యాసామ్రాజ్యాన్ని యువరాజై పరిపాలించాడు
ఉష్ణనేత్ర జలైః శీర్షణ్యభిషేకమథాకరోత్ :
రాజ్యం శశాప తేనాసౌ పుత్రేణాతిప్రియేణచ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి