24, డిసెంబర్ 2023, ఆదివారం

నాయనార్ల చరిత్ర - 37*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 37*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*గణనాథ నాయనారు*


తిరుజ్ఞాన సంబంధరు అవతరించిన శీర్గాళి పుణ్యక్షేత్రంలో ఒక

బ్రాహ్మణ కుటుంబంలో గణనాథుడనే శివభక్తుడు అవతరించాడు.

పరమేశ్వరుని అర్చించడమే తన జీవితధ్యేయంగా అతడు భావించి సదా

స్వామి కైంకర్యంలోనే కాలం గడుపుతూ వచ్చాడు. 


ఉద్యాన వనాల్లో

పూలమొక్కలను పెంచి, సురభిళ పుష్పాలతో అందమైన మాలలను కూర్చి

స్వామికి సమర్పించడం, స్వామి అభిషేకార్థం పవిత్రజలాలను తీసుకొని

రావడం, దేవాలయంలో దీపాలను వెలిగించడం, పవిత్ర శైవ గ్రంథాలైన

తిరుములై పఠించడం, వాటి ప్రతులను తీసి భక్తులకు పంచడం మొదలైన

సేవలను సంతోషంగా చేస్తూ వచ్చాడు.


గణనాధ నాయనారు గొప్ప శివభక్తుడైన తిరుజ్ఞాన సంబంధరును

కళ్లకు కనిపించే ప్రత్యక్ష దైవంగా భావించి మూడువేళలా అతని దగ్గరికి  వెళ్లి భక్తితో ప్రణమిల్లు తుండేవాడు. మరణించిన తరువాత గణనాధ

నాయనారు కైలాసం చేరుకుని అక్కడి శివగణాలకు నాయకుడై పరమ

శివునికి ప్రీతితో కైంకర్యం చేసే భాగ్యాన్ని సంపాదించాడు.


*ముపైఏడవ చరిత్ర సంపూర్ణం* 


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: