24, డిసెంబర్ 2023, ఆదివారం

వైకుంఠేకాదశి కబుర్లు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

##  ఓలేసు వైకుంఠేకాదశి కబుర్లు ##


గుడ్ మార్నింగ్ ఓలేసూ ...ఆహా..  బొట్టు.. చేతిలో టెంకాయ చిప్ప.. భలే..ఉదయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తిలా ఉన్నావ్ ... గుడికెళ్ళుస్తాన్నావా ? 


ఓలేస్ :: ఔ.. సామీ... తెల్లవారుఝామున లేసి పాత మార్కెట్ కాడ చెండ్రాయుని దేవలానికి పొయింటి ! .. అబ్బా ఏమన్నా రష్హా ! వల్ల గాల్యా...అలివిగాని రష్..!


ఔను..ఈ రోజు వైకుంఠేకాదశి గదా .. ఉత్తరద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటే ఓ నాలుగు బస్తాల పుణ్యం వీపున కట్టుకుని దక్షిణ ద్వారం గుండా రావొచ్చనేమో🤣 పెద్దోళ్ళు ఏది చెప్పినా ఏదో ఒక కారణం ఉంటుంది! సైన్స్ చెపితే వినరని భక్తి/మతం ముసుగులో చెప్తారు.. అదీ సంగతి ! 


ఓలేస్ :: ధనుర్మాసం.. ఏకాదశి.. పూజలెనక  సైన్సా ? ఎట్టెట్టబ్బా🤔


అవునోలేసూ...ఖగోళ శాస్త్రం.. ఉత్తరాయణం లో సూర్యుడు ధనుస్రాసి లోంచి మకరరాశిలోకిసంక్రమణ కాలం..వసంతకాలం.. చలి.. తినింది అరగదు...ఒంట్లో వుండే టాక్సిన్స్ బైటికి పోవు.. ఎండాకాలం లో ఐతే చెమట రూపంలో పోతాయ్..మరిప్పుడు పోవాలంటే   పొద్దున్నే లేచి స్నానం చేసి ఒక రౌండ్ వాఁకింగ్ కు పోయి బాడీకి శ్రమ కల్పిస్తే ..కొవ్వు కరిగి ఆరోగ్యం బాగుంటుందని ! 

ముప్పై రోజులు ముప్పై పాశురాలు వల్లేవేస్తో తిరిగితే ఒళ్ళు గాట్టిగుంటుందని🤣ఈ సైన్స్ చెబితే వినరు కాబట్టి.. దేవుళ్ళు మన ఊళ్ళల్లోనే మారువేషాలేసుకుని తిరుగుతూ ఉంటారని చెబితే.. గుళ్ల కెళతారు🤣 అదీ విషయం ఓలేసూ !


ఓలేస్ : ఔనయ్యోవ్...ఇప్పుడనిపిస్సాంది..పండగలప్పుడు గుమ్మాలకు మాడాకులు కట్టమని, గడపలకు పసుపు రాయండని, ఇంటిముందు బియ్యంపిండి తో ముగ్గులెయ్యమనీ...ఈటన్నిటి ఎనకాల సైన్స్ వుంటాదిల్యా !


ఔనోలెసూ...పండుగలకు ఇంటినిండా చుట్టాలు ..ఇంట్లో కార్బన్ డయాక్సైడ్ నిండుకుంటుంది... దాన్ని మామిడాకులు లాగేసి ఫ్రెష్ ఆక్సిజన్ సప్ప్లై... ఇక గడప పసుపు , పిండి ముగ్గు,  క్రిముల్ని, చీమల్ని ఇంట్లోకి రానివ్వవు ..అదే సైన్స్ !


ఓలేస్ :: ఔ... కరెక్టే బ్బా...సైన్స్ చెప్తే ఇనరని.. మన పెద్దోళ్ళు ""ఎవరి ఇంటి గుమ్మానికి మామిడాకులుంటాయో, గడపకు పసుపుంటుందో ఆ ఇంటికే లచ్చిందేవి కాళ్లకు గజ్జలు కట్టుకుని గల గల గల మంటూ బిందెలతో బంగారం ఎత్తుకుని వస్సాది🤣"" అని చెప్తారు ల్యా ! 


అంతేగదోలేసూ..లాజిక్కులు పనిచెయ్యని చోట మ్యాజిక్కులు పని చేసేది🤣అంతే గదా ఏమంటావ్ ! 


ఓలేస్ : ఏమనేదేముంది.... మనకు సదువు ల్యాక లాజిక్కులు ఇడిసిపెట్టి మ్యాజిక్కుల్ని పట్కొని యాల్లాడ్తాండామ్..ఇదే సందు చూస్కొని మనల్ని ఏలే ప్రభుత్వాలు కూడా మనకు మతం నూరిపోసి....దేవుళ్ళ కటౌట్లు సూపిచ్చి.. మనల్ని దోచి కార్పొరేట్ల గోచీల్లోకి రాండీబ్బా ...అంబా......అదా..... అని ప్లేట్లల్లో వడ్డీస్సాన్డారు..ఇదేందీయా అని అడిగితే.. సస్పెండ్ చేసేస్తా వుండారు... దేవుడు...దేశభక్తి పేరుతో ఉరితాళ్ళు పేని ప్రశ్నల కు ఉరేసి... ప్రతిపక్షం లేకుండా తమకు తమ వాళ్లకు అనుకూలమైన బిల్లులు పాస్ చేసుకుంటావుండారు...యాడికి పోతాదో.. ఏమైపోతాదో దేశం😩😩


అయ్యా... ఓలేసూ.. కూల్..కూల్...పెరుగుట విరుగుట కొరకే అన్నారు గా... దిగులు పడొద్దు...అయ్యప్ప మాలేసుకుని శివాలయం లో  సుదర్శన చండీ యాగం చేద్దాం లే  🤣


ఓలేస్ :: అట్లే చెస్సామ్ లేబ్బా... ఇంగో మూన్ల్లెళ్లు చండీ యాగం చేసి...గడపలకు రోజూ పసుపు పట్టించ్ఛాన్టే లచ్చిందేవి కాళ్లకు గజ్జెలు కట్టుకొని గల్ గల్ గల్ మని యాడున్య నల్ల డబ్బంతా తీస్కొచ్చి ఇంటికి పదైదు లచ్చలు ఏచ్ఛాది ....లెక్కొచ్చేటట్లయితే ఏ యాగమైనా చేస్సాం ..నేను రెడీ... వస్సా మరి అంగడికి పొయ్యి నల్ల గుడ్డలు కొనక్కొచ్చా....ఉంటా మరి 👍


అందరికీ ""వైకుంఠ ఏకాదశి'' శుభాకాంక్షలు


బసవరాజు వేణుగోపాల్

23.12.2023


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: