20, మే 2024, సోమవారం

సౌందర్య లహరి*

 *సౌందర్య లహరి* 

 *అరవై మూడో శ్లోక భాష్యం (63)* 


 *(శ్రీ శంకర భగవత్పాద విరచితము)* 


 *(శ్రీ లలితాంబికాయైనమః)* 


 *శ్లోకము (63)* 


 *"స్మితజ్యోత్స్నా జాలం తవవదనచంద్రస్యపిబతామ్* 

 *చకోరాణా మాసీదతిరసతయాచంచుజడియా!* 

 *అతస్తే శీతాంశో రమృతలహరీరామ్లరుచయః* 

 *పిబంతి స్వచ్ఛందం నిశినిశి భృశం కాంచికధియా !!"* 


అమ్మా ! భగవతీ! నీ నెమ్మొగమనే చంద్రుడి చిరునగ

వనే వెన్నెల మొత్తాన్ని గ్రోలుతూన్న చకోరపక్షులకు

ఆ వెన్నెల అతి మధురం అవటంతో ఆ చకోరాల

నాలుకలు చవి గాంచినవై మొద్దుబారిన వైనవి.

అందువల్ల అవి పులుపు రసంలో ఆసక్తి గొన్నవై

చంద్రుడి అమృతపు వెల్లువను అన్నపుగంజి అనే

భ్రాంతితో ప్రతి రాత్రిలోను యిష్టప్రకారం త్రాగుతున్నవి.


లలితా సహస్రనామ స్తోత్రం "మందస్మిత ప్రభాపూర

మజ్జద్కామేశ మానసా" అనే నామాన్ని పేర్కొంది. 

"చిరునవ్వుల కాంతుల ప్రవాహంలో తనపతియైన

కామేశ్వరుని మనసును మునకలు వేయించే తల్లి"

అని ఈ నామానికి అర్థం. శివుని వశం చేసుకోవాలని 

ప్రయత్నించి న మన్మథుని ఐదు పువ్వుల బాణాలూ

వ్యర్థమయ్యాయి . కానీ అమ్మవారి చిరునవ్వుల నే

బాణం ఒక్కటే ఆ కామ విజేతను ఆకర్షించగలిగింది.


చిరునవ్వు ప్రసన్న తనూ , నిర్వికారాన్ని, సర్వఙ్ఞతనూ

 చిదానంద తత్వాన్ని , కారుణ్యాన్ని , నిర్మలత్వాన్ని 

తెలియజేస్తుంది. ఈ భావాల సంకారమే దేవతాకృతి

కనుక దేవత చిరునవ్వు కు అంత ప్రాధాన్యం .


ఫాలనేత్రు డైన శివుడు చంద్రశేఖరుడు కూడా, అందువల్లనే తలపై చంద్రుని వెన్నెల కన్నా సొగసు

గల నవ్వు శివుని ది అని వ్యాసుడు శివపురాణంలో

పేర్కొన్నాడు. " తం సర్వాది గురుం మనోఙ్ఞవపుషం

మందస్మితాలంకృతం" అని ఆది శంకరులు శంకరుని

భావించారు. 

భగవంతుని చిరునవ్వు ను ధ్యానించడం ధ్యానం లో

ఒక శక్తిమంతమైన సాధనగా స్పష్టమవుతోంది. నవ్వు 

లో దివ్యత్వముంది. అందుకే దేవతా ధ్యానం లో

"మందహాస వదనం" ప్రాధాన్యం వహించింది. 


 "మందస్మిత వదనారవిందా" , "స్మేరాననః" . . . 

మొదలైన నామాలు దేవీ దేవ స్తోత్రాలలో కోకొల్లలు.


 *ఓం కామేశ్వరాస్త్రనిర్దగ్దందాసురశూన్యకాయైనమః* 

 *ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవాయైనమః* 

 *ఓం హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధ్యైనమః*


 *ఓం శ్రీ మాత్రే నమః*

కామెంట్‌లు లేవు: