20, మే 2024, సోమవారం

శంకర జయంతి ప్రత్యేకం

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం       

          (క్రితం నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )  


                           భాగం 8/10 


7. వివిధ స్తోత్రాలు 


      ఆదిశంకరులు వివిధ దేవతలని స్తుతిస్తూ అనేక స్తోత్రాలు అనుగ్రహించారు. 

     ఒక్కొక్క స్తోత్రం చివరిలో ఆ స్తోత్రంద్వారా ఆ దైవాన్ని స్తుతిస్తే పొందే ఫలాన్ని కూడా ఫలశ్రుతి పేరుతో తెలిపారు. 

     ఉదాహరణకి "రోగదోషాలు లేకుండానూ, సత్సంతానంతో అష్టైశ్వర్యాలు పొందుతారు" అనే ఫలశ్రుతితో గణేశ పంచరత్నాలు అందించారు. 


శారదా, లక్ష్మీ, పార్వతీ దేవతా స్తోత్రాలు 


    ఈ శక్తులకి సంబంధించి 

  - శ్రీ శారదాభుజంగ ప్రయాతాష్టకమ్, 

    కనకధారాస్తవమ్, 

    భ్రమరాంబాష్టకమ్, 

    అన్నపుర్ణాష్టకమ్, 

    శ్రీ త్రిపురసుందర్యష్టకమ్, 

    శ్రీరాజరాజేశ్వరష్టకమ్, 

    లలితాపంచరత్నం, 

    మహిషాసురమర్దనీ స్తోత్రమ్, 

    సౌందర్యలహరి వంటివి - వివిధ ఫలితాలు పొందేలా, స్త్రీమూర్తులను స్తుతిస్తూ స్తోత్రాలు అనుగ్రహించారు. 


విష్ణు సంబంధిత స్తోత్రాలు 


     వివిధ అవతారాలతో సహా విష్ణు సంబంధ స్తోత్రాలు అనేకం వారు అందించారు. 

  - నారాయణ స్తోత్రమ్, 

    గోవిందాష్టకమ్, 

    అచ్యుతాష్టకమ్, 

    శ్రీకృష్ణాష్టకమ్, 

    పాండురంగాష్టకమ్, 

    శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్, 

    శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రమ్ అనేవి వాటికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు. 


శివునికి సంబంధించిన స్తోత్రాలు 


  - భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలనీ పేర్కొన్న  ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రమ్, 

    శివ పంచాక్షరీ నక్షత్రమాలా స్తోత్రమ్, 

    శివానందలహరి, 

    శివభుజంగ ప్రయాత స్తోత్రమ్, 

    దక్షిణామూర్తి స్తోత్రమ్, 

    ఆదిదంపతులకి సంబంధించి ఉమామహేశ్వర స్తోత్రమ్,  అర్ధనారీశ్వర స్తోత్రమ్ మొదలైనవి. 


ఇతర దేవతా స్తోత్రాలు 


  - ఇహపర సుఖాలకి భక్తసులభుడు ఆంజనేయస్వామిపై హనుమత్పంచరత్నాలు, 

    శ్రీఆంజనేయ భుజంగ స్తోత్రమ్ 

    శ్రీ సుబ్రహ్మణ్య భుజంగమ్ మొదలైనవ అనుగ్రహించారు. 

     

      ఏదో ఒక దేవతనిగానీ, కొంతమంది దేవతలనుగానీ, అందరు దేవతలనూగానీ జనులు వారివారి ఇష్టాలతో స్తోత్రంచేసి, అవుసరమైన ఫలితాలు పొందేలాగా శంకరులు అనేక స్తోత్రాలు అందిచ్చారు. 


      దీనిద్వారా  మానవాళికి వారివారి ఇబ్బందులను తొలగించుకొనే అవకాశమూ, వారి కోరికలు సఫలమయ్యే మార్గము సులభంకావడమూ జరుగుతోంది. 


http://www.kamakoti.org/kamakoti/stotras/Shankara%20Stotras%20nine%20scripts.html 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: