*శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి*
*శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన*
*పాదారవిందశతకం*
🙏🌸🙏🙏🙏🌸🙏
*శ్లోకము:-*
*కవీనాం చేతోవన్నఖరరుచి సంపర్కి విబు*
*స్రవంతీ స్రోతోవ త్పటుముఖరితం హంసకరవై* |
*దినారంభ శ్రీవ న్నియత మరుణచ్ఛాయ సుభగ*
*మదంతఃకామాక్ష్యాఃస్ఫురతు పదపంకేరుహయుగమ్ ||27||*
*భావము:*
దేవీ చరణ కమలం నఖర రుచి ( న- ఖర- రుచి సంపర్కి : కఠినభావ సంపర్కం లేనిది, నఖర- రుచి సంపర్కి : గోళ్ళ కాంతులతో గూడినది) కవుల మనస్సువలె, రాయంచల కూతలచే అందెల రవళిచే ప్రతిధ్వనించు గంగా ప్రవాహమువలె అరుణోదయ కాంతిచే మనోహరం అయిన, ఉషఃకాల శోభవలె కామాక్షీదేవి చరణకమల ద్వంద్వం నా మనస్సున స్ఫురించుగాక!
*********
🔱 ఆ తల్లి
పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱 🙏🌸🌸🌸🌸🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి