*శ్రీ మూకశంకర విరచిత*
*మూకపంచశతి*
*శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన*
*పాదారవిందశతకం*
🙏🌸🙏🙏🙏🌸🙏
*శ్లోకము:-*
*దధానో భాస్వత్తం అమృతనిలయో లోహితవపుః*
*వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ |*
*గతౌ మందో గంగాధరమహిషి! కామాక్షి! భజతాం*
*తమః కేతుర్మాతస్తవ చరణపద్మో విజయతే 59*
▪▪▪▪▪▪▪▪▪▪▪
*భావము:*
గంగాధర పట్టమహిషీ, కామాక్షీదేవీ నీ చరణకమలము ప్రకాశమును వహించునదై ( *సూర్యుడు*), అమృతమునకు నిలయమై ( *చంద్రుడై*), ఎర్రని రూపం కలదై ( *అంగారకుడై*), భక్తులకు సౌమ్యమై ( *బుదుడై*), గురువై ( *బృహస్పతియై*), కవిత్వాన్ని అలవరించుచూ ( *శుక్రుడై*), నడకలో మాంధ్యమును కలిగినదై ( *శనియై*), తమస్సునకు ధూమకేతివై ( *రాహువు కేతువుయై*) భక్తులకు కామాక్షీదేవి దివ్యచరణం నవగ్రహరూపంతో విరాజిల్లుతున్నది.
🔱 ఆ తల్లి
పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱 🙏🌸🌸🌸🌸🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి