4, మే 2024, శనివారం

నర్మదా నది పుష్కరాలు*🕉☸️✡️🕉☸️✡️✡️☸️✡️

 నర్మదా నది పుష్కరాలు*🕉☸️✡️🕉☸️✡️✡️☸️✡️



పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. 

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. 


పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.


బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. 

పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. 


ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

పుష్కర సమయంలో పిండ ప్రదానం

సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.

(శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి)


పుష్కరకాల స్నానం

నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనే శక్తులున్నాయని వేదం వివరిస్తుంది.


మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.


నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.

తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం.

ఆ సమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.

త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.


నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.

ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు. 

నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు. 



పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ.

ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో, పూర్వీకుల ఆరాధన , ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు.


ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది.


నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి (వృషభ రాశి)లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు.


ఈ సంవత్సరం నర్మదా పుష్కరలు 2024 మే 1 నుండి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి.


అమర్‌కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్‌పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి.


పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నరమదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమ్రార్కంటక్ ఉత్తమమైన ప్రదేశాలు.

ఓంకారేశ్వర్‌లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్‌లు నిర్మించబడ్డాయి.


ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.

ఘాట్‌లపై నది లోతు ఎక్కువగా ఉండదు. మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.


భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్‌లను ఏర్పాటు చేశారు.

వారి భద్రత కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు.


ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్‌లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది.


ఓంకారేశ్వర్‌లోని ఇతర ముఖ్యమైన ఘాట్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

చకర్ తీర్థ ఘాట్,

గౌముఖ్ ఘాట్,

భైరోన్ ఘాట్,

కేవల్రామ్ ఘాట్,

నగర్ ఘాట్,

బ్రహ్మపురి ఘాట్,

సంగం ఘాట్,

అభయ్ ఘాట్

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷*🙏నర్మదా నది - పుష్కర స్నాన సంకల్పం🙏*


ఓం విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణుర్ విష్ణుర్ విష్ణుః, శ్రీ మద్ మహాపురుషస్య విష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశతే కలియుగే, కలిప్రథమచరణే, జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే, ...

ఆర్యావర్తే ఏకన్తరే దేశే, బ్రహ్మవర్తే దేశే ఓంకార్ గిరిజ క్షేత్రే మాంధాత్ మైన్డుర్ మణిపర్వతే, ఓంకారేశ్వర రాజరాజేశ్వరి నర్మదాయం దక్షిణ తటే, ఓమకారేశ్వర్ - మమలేశ్వర్ చతుర్థ జ్యోతిర్లింగ సన్నిదౌ, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, సాలివాహనే, ఉత్తరాయణే, మాసానాం మాసోత్తమే, మాసే పూర్ణ పవిత్రాదిక మాసే, చైత్ర మాసే, శుక్లే పక్షే పౌర్ణమ్యం, గురు బృహస్పతి వాసరాయం, వాసరః అముక వాసారాయం,  నక్షత్రే, మమాత్మనః, శ్రీమాన్ శ్రీమత గోత్రః ఆత్రేయస గోత్రం  శర్మ ధర్మపత్నీసమేతస్య సహ కుటుంబస్య___🫧🫧🫧🫧🫧🫧🫧🫧🫧🫧🫧🫧 *యుగే యుగే నర్మద*


మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. 

అది పారే విధానం, దిక్కు, సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం... వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది.


భారతీయుల దృష్టిలో నది, ప్రవహించే నీరు మాత్రమే కాదు… 

జీవాన్నిచ్చే శక్తి!తాపం తీర్చే వనరే కాదు… ప్రాణం నిలిపే తల్లి కూడా! 

అందుకే నదిని దేవతగా పూజిస్తాం. 

ప్రతి భారతీయుడు తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నదిని దర్శించుకోవాలని తాపత్రయపడతాడు.

అనాదిగా తన తరాలను నిలబెడుతున్న నది పట్ల మనిషిది కృతజ్ఞత మాత్రమే కాదు, ఆరాధనా భావం కూడా! ఆ నదీ తీరానే పితృ దేవతలను తలుచుకుంటాడు, నదీ జలాలను అర్ఘ్యంగా సూర్యుడికి సమర్పిస్తాడు. 


ఆ నీటిలో తడిసి, వాటిని నెత్తిన జల్లుకుని మూడు మునకలు వేసి తరిస్తాడు.


అందుకు కల్పించుకున్న ఓ అపురూప సందర్భమే పుష్కర స్నానం! ‘నర్మదా సింధు కావేరీ..’ అంటూ నీటిని పవిత్రం చేసే మంత్రం చెప్పుకొంటాం. 


ఆ నర్మదకు ఈ రోజు నుండి పుష్కరాలు… 


పుష్కరాల సంప్రదాయం వెనుక ఉన్న కథలలో ఎక్కువగా వినిపించే గాథ ఇది.


 పూర్వం తుందిలుడు అనే రుషి ఉండేవాడు. ఆయన శివుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. 

ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే… 


‘నీలో నాకు శాశ్వత స్థానం లభించేట్లు అనుగ్రహించమ’ని వేడుకున్నాడు తుందిలుడు.


అతని భక్తికి మెచ్చిన శివుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా మారమని తుందిలుణ్ని అనుగ్రహించాడు. 

అలా ఈ జగాన ఉన్న జలాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. 

జలం లేకుండా జీవం లేదు కాబట్టి, తుందిలుడికి పుష్కరుడు (పోషించేవాడు) అన్న మారుపేరు స్థిరపడింది.


ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు తన సృష్టిని కొనసాగించడానికి జలశక్తి అవసరమైంది. 

దాంతో పుష్కరుణ్ని తనకు అండగా ఉండమని ఆహ్వానించాడు. 

శివుడి అనుజ్ఞతో పుష్కరుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి సృష్టికి సాయపడ్డాడు. 

బ్రహ్మ పని పూర్తయినప్పటికీ, పుష్కరుణ్ని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయింది.

అలా పుష్కరుడు బ్రహ్మ దగ్గరే ఉండిపోయాడు.


కొన్నాళ్లకు దేవగురువైన బృహస్పతి, భూమి మీద ఉన్న జీవులందరినీ తన జలశక్తితో పాపవిమోచనం చేయగలిగే పుష్కరుణ్ని తనతో పంపమని బ్రహ్మను అభ్యర్థించాడు.


 పుష్కరుణ్ని శాశ్వతంగా వదులుకోవడం ఇష్టం లేని బ్రహ్మదేవుడు ఓ మధ్యేమార్గాన్ని సూచించాడు.


 బృహస్పతి ఒక ఏడాదిలో ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో, నాటి నుంచి 12 రోజుల పాటు ఒక నదిలో ఉండమని సూచించాడు. 

అలా 12 రాశులకు, 12 నదులను కేటాయించాడు.


గంగానది (మేషరాశి), 

నర్మద (వృషభం), 

సరస్వతి (మిథునం), 

యమున (కర్కాటకం),

గోదావరి (సింహం), 

కృష్ణ (కన్య), 

కావేరి (తుల), 

భీమా/తామ్రపర్ణి (వృశ్చికం),

తపతి/బ్రహ్మపుత్ర (ధనుస్సు),

తుంగభద్ర (మకరం), 

సింధు (కుంభం), 

ప్రాణహిత (మీనం)...


ఉత్తరాదికి జీవనది!

నదుల గురించి చెప్పుకొనేటప్పుడు గంగ, యమున, కృష్ణ, గోదావరి లాంటి పేర్లు వినిపించినంతగా నర్మదను తల్చుకోరు. 


నిజానికి నర్మద కూడా అంతే అద్భుతమైన జీవనది, భారతదేశంలో ప్రవహించే నదులలో అయిదో అతిపెద్ద నది. 

పశ్చిమంగా ప్రవహించేవాటిలో అతి పొడవైనది. 

అందుకే మహానది అని కూడా పిలుస్తుంటారు.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో ప్రవహించే ఈ నది తొలి రెండు రాష్ర్టాలకు అపారమైన జలరాశిని అందిస్తున్నది. 


ఒక్క మాటలో చెప్పాలంటే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవనం లాంటి వాటిని నర్మద లేకుండా ఊహించలేం.

 సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల నర్మద పరీవాహక ప్రాంతం చాలా వైవిధ్యమైంది, పురాతనమైంది కూడా.

 దాదాపు 16 కోట్ల సంవత్సరాల కిందట ఉత్తర భారతదేశం, ఇప్పటి ద్వీపకల్పం విడివిడిగా ఉండేవి. 

వాటిమధ్య ఏర్పడిన లోయలో ప్రవహిస్తున్నదే నర్మద. 

ఇంత వైవిధ్యమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది కాబట్టే నర్మదలోయలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి...


నర్మద చుట్టూ.. ఆ నదిలో భాగంగా పర్వతశ్రేణులు, జలపాతాలు, లోయలు లాంటి భౌగోళిక అద్భుతాలు కనిపించేందుకు కారణం… అది ఏర్పడిన తీరే. 

అత్యంత ప్రాచీనమైన జీవనది కాబట్టి ఇక్కడి తీరప్రాంతంలో డైనోసార్ల అవశేషాలూ కనిపించాయి

కామెంట్‌లు లేవు: