4, మే 2024, శనివారం

కంచి పరమాచర్య

 కంచి పరమాచర్య ధర్మం పాటించుట... 🙏

పీఠాధిపతులు షడ్రసోపతమైన భోజనం చేయాలి.. వారికి దేనిమీద కూడా జిహ్వ ఉండకూడదు. అదీ నియమం.

ఒకరోజు ఆశ్రమం లో వంట వాడు వంట వడ్డించాడు. ఈ పప్పు ఏ పదార్ధం తో చేసావ్ అని అడిగారు స్వామి. వంట వాడు తోట కూర పప్పు స్వామి అని బావుందా అని అడిగారు. పోరాటున స్వామి వారు బావుంది అని అన్నారు. మరుసటి రోజు, మూడవ రోజు కూడా వంట వాడు తోటకూర పప్పు వడ్డిస్తున్నాడు. అదేమిటి రోజు ఈ పప్పే ఎక్కడ నుండీ వస్తోంది అన్నారు. అప్పుడు వంట వాడు మీరు తోటకూర పప్పు వండితే సంతోష పడుతున్నారు అని శిష్యులతో అన్నాను. వారు కట్టలు కట్టలు తీసుకుని వస్తున్నారు దానిలో మంచిది ఎంచి చేస్తున్నాను అన్నాడు.అలాగా అన్నారు స్వామి వారు.

మరునాడు భోజనం వేళ నేను ఇవ్వాళ బిక్ష స్వీకరించటం లేదు అన్నారు. తరువాత రోజు కూడా బిక్ష చేయటం లేదు అన్నారు.మరి ఏమి తీసుకుంటారు అని అడిగారు శిష్యులు. ఉసిరికాయ అంత గోమయం, ఆచమనం చేయటానికి గోమూత్రం అన్నారు స్వామి. వారు అవే ఏర్పాటు చేశారు.ఉసిరికాయ అంత గోమయం నోట్లో వేసుకునేవారు, గోమూత్రం చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు. అలా వారం రోజులు అయిపోయాయ్. పీఠాదిపతులు ముద్ద ముట్టటం లేదు. ఆశ్రమం లోని వారు అందరు వచ్చి కాళ్ళమీద పడిపోయారు . 

https://chat.whatsapp.com/IToTTEJvyEuE3gAGJ03Y2d

ఏమైంది స్వామి ఎందుకు అని అడిగారు. దానికి స్వామి వారు నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెళితే నన్ను అనుగ్రహ భాషణం చేయమంటారు.నేను గురువు యొక్క స్వరూపం తో వేదిక మీద కూచుని ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇంద్రియాలకు లొంగ కూడదు అని చెప్తాను. మహానుభావులు శంకరాచార్యులు కూచున్న పీఠo కి అధిపతినయి ఒక తోటకూర పప్పు రుచి కి లొంగి పోయిన నేను జగద్గురు శంకరాచర్య అని పిలిపించుకొనా... పీఠాధిపతి ని అని పిలిపించుకోనా..పది మందిని కూచోపెట్టి అనుగ్రహభాషణం చేయనా.. ఎక్కడ ఉంది ఈ నాలుక కి ఆ యోగ్యత.. ఏ నాలుక తోట కూర పప్పు రుచి కి లొంగిందో దాన్ని గోమయం తో శుద్ధి చేస్తున్నాను.. గోమూత్రం తో శుద్ధి చేస్తున్నాను. మరొకనాడు ఆ నాలుక రుచి నందు ప్రవర్తించనంత కాలం అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశ దేశాలు పొక్కుతుంది. కంచి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి వారికి తోటకూర పప్పు ఇష్టం అని.. తోటకూర పప్పు కి ప్రీతి పడిన వాడు పీఠాదిపతా.. ఈ పదవి లో కూచున్న నేను ప్రవర్తించని తీరు లో ప్రవర్తించాను. అందుకని శుద్ధి చేసుకుంటున్నాను. అన్నారు.

ఆనాటి నుండీ స్వామి వారికి వడ్డిoచిన భిక్ష లో పదార్ధాలు..లడ్డు కూర పప్పు పులుసు అన్ని కలపడమే.. ఇది బావుంది అన్న మాట కానీ బాలేదు అన్న మాట కానీ అయన నోటివెంట రాలేదు..

ఇది పరమాచర్య జీవితం 🙏🙏

కామెంట్‌లు లేవు: