4, మే 2024, శనివారం

పెసరట్టు ఉప్మా కథ.*

 *పెసరట్టు ఉప్మా కథ.* 


💐💐💐💐💐💐 పూర్వం ఒక సినిమాలో ఒక రంజైన పాట వుంది. "అట్టు అట్టు పెసరట్టూ... ఉల్లిపాయ పెసరట్టూ... ఉప్మాతో జత పెట్టు... అరె చట్నీతోటీ కలేసి కొట్టు..." అని. ఉప్మా కి ఒక జత కలపండి. అదే పెసరట్టు... ఉప్మా కి పూర్వీకులు ముగ్గురు ఉండే వారు.  వారి పూర్వ వృత్తాంతం కూడా మనం చెప్పుకోవచ్చు. పెసరట్టు ఉప్మా కి వెనుక చాలా పురాతనమైన  పురాణం ఉంది. ఉప్మా కి పూర్వీకులు ముగ్గురు ఉప్పు పిండి,  చప్పిడి పిండి, పులుసు పిండి (పిండి పులిహార). ఘోర తపస్సు ఆచరించిన ఉప్పుపిండి 6 గురు  పుత్రికలు పొందింది. అవి వరుసగా: 1.వరినూక ఉప్మా. 2.జొన్ననూక ఉప్మా. 3.గోధుమనూక ఉప్మా. 4.మొక్క జొన్న ఉప్మా. 5.కొర్ర నూక ఉప్మా. 6.బొంబాయిరవ్వ ఉప్మా. మొదటి 5 గురు కన్యలు వివాహం చేసుకోకుండా, ఉపవాసములు, ఏకాదశినాడు ‌వ్రతములయందు భక్తులకు ఫలహారాలుగా సేవ చేయుచున్నారు. వీరి సేవకు మెచ్చిన పరమేశ్వరుడు, "మీకు ఏ వరం కావాలో కోరుకో" మన్నాడు. అంతట  ఆ అయిదుగురు మా ఆఖరి సోదరికి వివాహం జరిగి, దాని దాంపత్యం కలియుగాంతం వరకు అన్యోన్యంగా ఉండేలా వరమివ్వమని కోరగా పరమేశ్వరుడు సంతోషించి, నవగ్రహములలో విశిష్టత పొందిన  బుధుడి అంశతో జన్మించిన పెసరట్టు తో వివాహం జరిపించినట్టు పురాణం వచనం. అన్యోన్యంగా ఉండే దంపతులను  "పెసరట్టు - ఉప్మా ల్లా" కలిసి ఉన్నారనే  ఓ నానుడి ఏర్పడింది ! సర్వే ఉప్మా - పెసరట్ ప్రేమికాః సుఖినో భవంతు !


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

కామెంట్‌లు లేవు: