🌹🌹🌹నీతి వాక్యంn 🌹🌹🌹
☘️☘️☘️☘️🙏☘️☘️☘️☘️
కాకరచెట్టుకి కంపు గిట్టదు! పొట్ల చెట్టుకి పొరుపు గిట్టదు. ఇష్టమైన వారికి కాలకూట విషం కూడా కమ్మగా, తియ్యగా ఉంటుంది! అది మనిషి ఆలోచన విధానం!
కురుక్షేత్ర సంగ్రామం ఐన తరువాత ఆకాశవాణి ధర్మరాజుని పిలిచి క్రూరమైన జీవుల్లో అతి క్రూరమైన జీవి ఏది? అని అడిగితే! ధర్మరాజు వెంటనే ""మనిషి " అని చెప్పాడుట! వెంటనే ఆకాశవాణి నీవు ఎల్లప్పుడూ ఇలాగే చెపుతూ ధర్మరాజుగా వర్ధిల్లమని చెప్పిందట!
మనిషి ప్రక్క మనిషిని నిందించటం తప్పు అని తెల్సినా చేయక మానడు. అదే మానవ నైజం. ప్రతి ఆలోచనలో ఖర్చు లేకపోతే పొదుపు ఉండదు! అలుపు లేకపోతే జీవితంలో మలుపు ఉండదు, కాబట్టి అటుపోటులు సహజం అదుపు, అలుపు సరి సమానంగా చూసుకుంటూ పోయిన వారే జీవితంలో విజేతగా నిలువ గలడు.
నాదగ్గిర ఏముంది ఇవ్వడానికి అంటారు కొందరు. ఎంత ఇచ్చినా తరగని ఆస్తులు రెండు ఉన్నాయి, మొదటిది స్వచ్ఛమైన నవ్వు. రెండవది సంతోషం.
ప్రేమని ఎంత పంచితే అంత దగ్గరయ్యే ఆత్మీయత, వెలకట్టలేనివి. ఇతరులు చేసిన ఏనుగoత తప్పుని, ఆవగింజంతా చేసి చూడు,,,,, *నువ్వు చేసిన చిన్న తప్పుని కూడా కొండంత తప్పుగా భావించు అప్పుడు ఏమి జరుగుతుందో చూడండి. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇది సత్యం.*
విదుర నీతి కూడఇదే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి