22, సెప్టెంబర్ 2020, మంగళవారం

కౌపీన పంచకం (శంకరాచార్య) ॥

కౌపీన పంచకమ్

వేదాన్తవాక్యేషు సదా రమన్తో

భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః ।

విశోకమన్తఃకరణే చరన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౧॥

వేదాంత విషయాలలో ఎప్పుడూసంచరిస్తూ 

బిషటనతో లభించిన దానితో సంతుష్టుడై 

 శోకాన్ని వదిలి వున్నవాడు 

కౌపీన దారి అత్యంత భాగ్యశాలి -1


మూలం తరోః కేవలమాశ్రయన్తః

పాణిద్వయం భోక్తుమమన్త్రయన్తః ।

కన్థామివ శ్రీమపి కుత్సయన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౨॥


ఆశ్రయం కోసం చెట్టు అడుగున కూర్చుని,

దోసిలికి పట్టినంటే తిండి తిని 

 వదిలిన వస్త్రంలా సంపదలను త్యజించటం చేసే 

కౌపీన దారి అత్యంత భాగ్యశాలి  (2)


స్వానన్దభావే పరితుష్టిమన్తః

సుశాన్తసర్వేన్ద్రియవృత్తిమన్తః ।

అహర్నిశం బ్రహ్మసుఖే రమన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౩॥


తానూ పొందే ఆనందంతో ఎల్లప్పుడూ తృప్తిగా ఉండటం,

అతని ఇంద్రియాల కోరికలను పూర్తిగా అరికట్టడం,

బ్రహ్మమానందలో  పగలు మరియు రాత్రిగడపటం చేసే 

,కౌపీన దారి అత్యంత భాగ్యశాలి  (3)


దేహాదిభావం పరివర్తయన్తః

స్వాత్మానమాత్మన్యవలోకయన్తః ।

నాన్తం న మధ్యం న బహిః స్మరన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౪॥


మనస్సు మరియు శరీరన్ని పూర్తిగా గమనిస్తూ 

తనలో వున్నది ఆత్మ తప్ప మరొకటి కాదనే భావనకలిగి 

ఆ ఆత్మ ఆది, మధ్య, అంత రహిత మైనదని  తెలుసుకునే 

కౌపీన దారి అత్యంత భాగ్యశాలి   . (4)


బ్రహ్మాక్షరం పావనముచ్చరన్తో

బ్రహ్మాహమస్మీతి విభావయన్తః ।

భిక్షాశినో దిక్షు పరిభ్రమన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౫॥


విమోచన పదమైన బ్రహ్మన్ని స్పరిస్తూ, 

నేనే బ్రహ్మను అనే ద్యాస కలిగి ఉండటం.  

బిక్షాటనతో జీవిస్తున్న స్వేచ్ఛ విహారి 

కౌపీన దారి అత్యంత భాగ్యశాలి . (5)

॥ ఇతి శ్రీమద్ శఙ్కరాచార్యకృత కౌపీన పఞ్చకం సమ్పూర్ణమ్ ॥


సేకరణ

కౌపీన ధారిని ఉద్దేశించి వ్రాసిన ఐదు శ్లోకాలు  అత్యంత వేదాంత పరమైనవి. ఆధ్యాత్మిక చింతనలో జీవనం గడిపే వారికి ఇవి ఎంతో  మార్గదర్శనం చేస్తాయి. 

కౌపీనం (గోచి) ధరించిన ఒక సాదారణ సాధువు ప్రజలకు ఏమి లేని అతి పేదవాడుగా కనబడతాడు. కానీ అతని జీవితం పూర్తిగా ఆ బ్రహ్మత్వం వైపు మాత్రమే మళ్లిస్తాడని ఆది శంకరాచార్యులు వ్రాసిన ఈ కౌపీన పంచకం. 











కామెంట్‌లు లేవు: