16, జులై 2023, ఆదివారం

ప్రమాదమని

 శ్లోకం:☝️

*అన్తకోఽపి హి జన్తూనామ్*

    *అన్తకాలమపేక్షతే ।*

*న కాలనియమః కశ్చిత్*

    *ఉత్తమర్ణస్య విద్యతే ॥*


అన్వయం: _యావత్ మరణకాలః సన్నిహితః న భవేత్ తావత్ యమః అపి కస్యాపి ప్రాణాన్ అపహర్తుం నార్హతి । కిన్తు తాదృశం కాలనీయం న అనుసరతి ఋణదాతా । యదాకదాచిత్ గృహద్వారే ఉపస్థాయ ‘ఋణం ప్రత్యర్పణీయం ఇదానీం ఏవ’ ఇతి భీతిజననపూర్వకం వదన్ ఋణస్వీకర్తుః ప్రాణహరణాయ ఏవ ఉద్యతః భవతి సః ।_


భావం: యమధర్మరాజు కనీసం మరణకాలం వచ్చేంత వరకు ఆగి అప్పుడు చంపుతాడు. అప్పుల వాళ్లు ఇంటి బయటే తిష్ఠవేసి ఇప్పటికిప్పుడే అప్పు చెల్లించమంటారు , చంపటానికి సైతం వెనుకాడరు! అప్పుల వాళ్లు యమధర్మరాజు కంటే ప్రమాదమని కవి చమత్కారం.

మళ్ళపూడి వేంకటరమణ గారు అప్పుల వాళ్ల బాధ భరించలేక 'ఋణానందలహరి' అని పుస్తకమే వ్రాసారు!

కామెంట్‌లు లేవు: