16, జులై 2023, ఆదివారం

మూత్రపిండములలో నొప్పి తగ్గుటకు

 5 నిమిషములలో మూత్రపిండములలో నొప్పి తగ్గుటకు నేను ప్రయోగించిన సిద్ద ఔషధం - 


    మూత్రపిండములలో రాళ్లు ఉన్నట్టు చాలమందికి తెలియదు. వారికి ఒక్కసారిగా వీపు భాగంలో విపరీతమైన నొప్పి మొదలై విలవిలలాడిపోతారు . చాలా భయంకరంగా నొప్పి వస్తుంది . ఈ విధమైన నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి కి నేను 5 నిమిషములలో నొప్పి తగ్గించాను. 


      మూసామ్బరం ని కంది గింజ అంత పరిమాణం లో తీసుకుని ఒక ద్రాక్ష పండు తీసుకుని దానిలో గింజలు తీసివేసి లొపల మూసామ్బరం పెట్టి మింగించి నీటిని త్రాగించాను. కేవలం 5 నిమిషములలో నొప్పి నుంచి విముక్తి లభించినది. 


          బొడ్డుకింద బాగంలో నొప్పి వచ్చినను ఇదే యోగం ఉపయోగపడుతుంది 


 గమనిక - 


      మూసామ్బరం మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును. కలబంద ఆకులోని గుజ్జుని ఎండించి తయారుచేస్తారు. చంటిపిల్లలకు పాలు మాన్పించడానికి తల్లి యొక్క చనుమొనలు కు రాస్తారు. 


       ఇది నా అనుభవ యోగం 

  

 

     మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

కామెంట్‌లు లేవు: