16, జులై 2023, ఆదివారం

పోతనగారి కవితాచిత్రము!

 శు భో ద యం🙏


పోతనగారి కవితాచిత్రము!


      భక్తరక్షణా పరాయణుడై పరువిడివచ్చు ఆదేవదేవుని వర్ణనమిది.అనుప్రాసవిన్యాసంతో తొలిపద్యం శ్రీహరిసురూపదర్శన భాగ్యానికి కద్దంపట్టగా,

రెండవపద్యం ఆదేవదేవుని అబ్బురపడిచూచి నమస్కరించేదేవతాగణవిన్యాసం!!

ఈపద్యాలకిక వ్యాఖ్యనం అవసరంలేదేమో? ఇక మీయోచనా లోచనాలతో వీక్షించండి!


"వినువీధిన్ జనుదేరఁగాంచిరమరుల్ విష్ణున్, సురారాతిజీ

వనసంపత్తి నిరాకరిష్ణు, కరుణావర్ధిష్ణు ,యోగీంద్రహృ

ద్వనవర్తిష్ణు,సహిష్ణు,భక్తజనబృందప్రాభవాలంకరి

ష్ణునవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్; 105-ప:


వ:అట్లుపొడఁగని; -106 -వ.


"కనుగొని యల్లవాడె హరి! పజ్జంగంటిరే,లక్ష్మి, శం

ఖనినాదంబదె, చక్రమల్లదె,భుజంగధ్వంసియున్ వాడెక్ర

న్నన నేతెంచె నటంచు వేల్పులు "నమోనారాయణా!యేతి" ని

స్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ జక్రికిన్; 107-ప.


                                   స్వస్తి!!!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🙏🌷👍🌷

కామెంట్‌లు లేవు: