16, జులై 2023, ఆదివారం

తత్త్వం

 🌷తత్త్వం' అనే మాటకి అసలు అర్థం ఏమిటి? 'శరీర తత్త్వం', 'మనస్తత్వం', 'పరతత్త్వం' లాంటి మాటలు వింటుంటాం. వాటికి భేదాలున్నాయా? అని అడిగే వారికి ఈ పోస్ట్...


జవాబు; 'తత్త్వం యథార్ధ్యే బ్రహ్మణి' అని అర్ధాన్ని చెప్పాయి శాస్త్రాలు. ఒక వస్తువు యొక్క యథార్ధ (ఉన్నదున్నట్టు) స్వరూపాన్నీ, లేదా-పరబ్రహ్మని 'తత్త్వం' అనే మాటతో చెప్పవచ్చు. ఉన్నది ఉన్నట్టు అంటే 'స్వభావం'. కనుక 'స్వభావాన్ని కూడా తత్త్వం అనవచ్చు. శరీర స్వభావం - 'శరీర తత్త్వం'. మనస్స్వభావం 'మనస్తత్త్వం'.


ఆయుర్వేద ప్రకారం- వాతపిత్త కఫాలు శరీరతత్త్వాలు. సత్త్వరజస్తమోగుణాలు మనస్తత్వాలు. ఈ రెంటికీ అతీతమై, అన్నిటా చైతన్యంగా ఉన్న పరమాత్మయే 'పరతత్త్వం'., ఇదే 'బ్రహ్మణి' (పర బ్రహ్మగా) అని చెప్పబడినది.

కామెంట్‌లు లేవు: