అద్వైత వాసన లేకుండా అద్వైతానుభం రాదు. జన్మాంతర సంస్కారము ఉండాలి. అద్వైత అనుభవం అటుంచండి. ముందుగా అద్వైత వాసన రావాలి. ఆ సంస్కారం రావాలి. ఎంతో పుణ్యబలం ఉంటే గాని అద్వైత వాసన రాదు. సత్కర్మలు చేసి ఉండాలి. సద్వస్తువు గురించిన విషయాల విని ఉండాలి. ఆ విన్నవాటిని ప్రత్యేక సాధన చేసినా, చేయకపోయినా అవసరమైనప్పుడు మనకు అవి తప్పనిసరిగా కాపుదలగా ఉంటాయి.
అద్వైతమనేది మన గమ్యం. వ్యావహారిక
జీవితంలో ద్వైతపరంగానే ఉండాలి. కానీ అద్వైతం మన గమ్యం కావాలి!
అందుకు ఎలా సాధన చేయాలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు
చెప్పాడు. మనం ఈ జగత్తులో ఎన్నో జీవాలను చూస్తూ ఉంటాం.
ఉదాహరణకు ఒక ఆవుని చూస్తాం, అలాగే ఒక కుక్కని చూస్తాం, ఒక
మంచి వాణ్ణి చూస్తాం, ఒక చెడ్డవాణ్ణి చూస్తాం, పులిని చూస్తాం, రకరకాల
జంతువులను చూస్తాం, రకరకాల మనస్తత్వాలు గల మనుషుల్ని చూస్తాం.
వాళ్ళ మనస్సులను చూడటం మానేసి, అంతర్యామిగా ఉన్న నన్నే
చూడటం నేర్చుకోమన్నాడు భగవంతుడు. మంచివాడిలోనూ, అలాగే
చెడ్డవాడి లోనూ ఆ నారాయణుడే అంతర్యామిగా ఉన్నాడు! లోకంలో
మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. వాస్తవానికి ఈ లోకంలో చెడు
అవసరం కూడా ఉన్నది! ఎందుచేతనంటే, మంచివాళ్ళ మంచితనం
అభివృద్ధి చేయడానికి చెడ్డవాళ్ళు ఉండాలి. సాధకులకు తితిక్ష (సహనం)
అవసరం. అది మనకు ఎంతవరకు ఉన్నదనేది పరీక్ష చేయడానికి
చెడ్డవాళ్ళు ఉపయోగపడతారు.
ఊర్స్.. జయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి