కళల వలన ప్రయోజనం
విద్య అంటే మనం పాఠశాలల్లోనో లేక కళాశాలల్లోనో చదువుకునే చదువే కాదు మనం తెలుసుకునే ప్రతి జ్ఞ్యానం కూడా విద్యయే. కొన్ని సందర్భాలలో మనం చిన్నతనంలో సరదాగా నేర్చుకునే కళలు కూడా కొన్ని సందర్భాలలో మన ప్రాణాలను కాపాడవచ్చు. అటువంటిదే ఒక యదార్ధ సంఘటన నాకు ఇంటర్నెట్లో దొరికింది. అది మీతో పంచుకుంటున్నాను.
కేరళ నుంచి ఒక మిత్ర బృందం అస్సాం అందాలు చూడాలని బయలుదేరి వెళ్ళారు. చాలాచోట్ల తిరిగారు. ఒక కొత్త ప్రదేశం చూడాలని అక్కడివారి సాయంతో జీప్ లో బయలుదేరి వెళ్ళారు, చూడవలసినవి చూసి వస్తున్నారు ఘాట్ రోడ్ లో. హటాత్తుగా ఏనుగుల గుంపు కనిపించింది, ఏం చేయడానికి తోచక జీప్ ఆపుకుని కూచున్నారు. కొందరు జీపు దిగారు. ఒక పక్క లోయ, మరో పక్క ఎత్తైన కొండ. లోయ పక్క దట్టమైన చెట్లు. ఒక ఏనుగు జీపుని లోయలోకి తోసేసింది. ఎవరికి తోచింది వారు చేశారు, జీప్ నుంచి దూకినవారు, పరుగెట్టి వెనక్కిపారిపోయినవారు, ఇలా చెట్టుకొకరు పుట్టకొకరు ఐపోయారు. ఒకతను జీప్ లో ఉండిపోయాడు, జీప్ ని తోయడంలో బయటపడి లోయలో పడిపోయాడు, చివరికి జారి లోయ కిందికి చేరిపోయాడు.స్పృహ తప్పిపోయాడు జీపు చెట్లలో చిక్కుకుపోయింది. .
రాత్రి పడింది, పైవాళ్ళు ఏనుగులు వెళ్ళిన తరవాత ఒక్కొకరూ చేరేరొకచోటికి, అందరూ చేరారు కాని ఈ లోయలో పడినవాడు కనపడలేదు, వెతికినా! లోయలో పడిపోయి ఉంటాడనుకున్నారు, కేకలేశారు, కిందవాడికా కేక అందలేదు,స్పృహ తప్పిపోయాడు. ఉదయం చూద్దామని ముందుకెళ్ళిపోయింది మిత్ర బృందం చాలా సేపు వెతికి వేసారి. మర్నాడు ప్రమాదం జరిగిన చోట వెతికారు,ప్రయోజనం లేకపోయింది, జీప్ ను పైకి లాక్కుని వెళిపోయారు.. పోలీస్ కి ఫిర్యాదిచ్చి వెనక్కి పోయారు, ఆచూకీ దొరకలేదని.
లోయలో పడినవాడికి కొంతకాలానికి తెలివొచ్చింది. కేకలేశాడు, పైకి ఎక్కడానికి ప్రయత్నమూ చేశాడు, విఫలమయ్యాడు. ఆ దారి ఉపయోగించేవారు తక్కువ కావడంతో ప్రయోజనం లేకపోయింది. ఏంచెయ్యాలి? కడుపులో కాలుతోంది, మరికొంత దూరం కాలు సారిస్తే కొన్ని పళ్ళు దొరికాయి,తిన్నాడు, సెలయేరు కనపడితే నీరుతాగాడు. ఆకలి దప్పికలు తీరాయి, తరవాత భయం లేకపోవడంతో పైకి చేరుకునే మార్గం గురించి ఆలోచన మొదలు పెట్టేడు. ఏం చేయాలో తోచలేదు. అలా తిరుగుతుండగా వెదురుపొద కనపడింది. వెదురు కర్రని సాధ్యం చేసి, ఉన్న రాళ్ళ తో ఒక వేణువును తయారు చేశాడు. ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న వేణువును పలికించడం ప్రారంభించాడు. అదే ఒక తపస్సు అయి వేణువును పలికించడమే పరమావధిగా చేసుకున్నాడు.
ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక సైనికాధికారి ఆ రోడ్ న పోతూ వేణుగానాన్ని విన్నాడు, జీప్ ఆపించి పరిశీలించమన్నాడు. ఎవరూ కనపడలేదు, కేకలకి ప్రతి స్పందించలేదు. అధికారి లాభం లేదనుకుని మరలిపోయాడు. మరునాడు మళ్ళీ వేణుగానం విన్నాడు, ఆచోటిలోనే. ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలం బయలుదేరి, కొంతమంది సైనికులతో, తాళ్ళు తదితర సామగ్రితో వచ్చి లోయలోకి దిగి వేణుగానం వైపుసాగారు. అక్కడ ఇతను కనపడ్డాడు. లోయలో ఉన్నావాని భాష సైనికులకురాదు, సైనికుల భాష లోయలోనివానికి తెలియదు. మొత్తానికి అతన్ని తీసుకుని పైకొచ్చారు. అధికారిదీ అదే వ్యధ, లోయలో పడినవానికి మరో భాష రాదు. విదేశీయుడా? గూఢచారా? అనేక అనుమానాల మధ్య అతన్ని సైనిక కేంద్రానికి తీసుకొస్తే అతను మాటాడుతున్న భాష మలయాలం అని తెలిసి, సైనికులలో మలయాలం తెలిసినవారితో మాటాడించి అతని చరిత్ర తెలుసుకున్నారు.
లోయలో పడినవాని మురళీ వాయిద్యానికి అధికారి ముగ్ధుడయాడు. ఒక సభ చేసి ఇతనిచే వేణుగానం చేయించి విన్నారు. అందరూ ఆనంద పరవశులయ్యారు. ఎవరిమటుకువారు అతనికి కొంత సొమ్మిచ్చారు, అప్పటికప్పుడు, అక్కడికక్కడ. అధికారి ఇతని క్షేమసమాచారం అతని ఇంటికి చేరేశారు, తొందరలో తిరిగొస్తున్నట్టూ టెలిగ్రాం లిచ్చారు. ఇతని చేత మరికొన్ని కచేరీలు చేయించి ఇతోధికంగా సత్కరించి, రైలెక్కించి, తడికళ్ళతో వీడ్కోలు పలికారు. కథ శుభాంతం అయింది.
చూసారా చిన్న
చిన్న
విషయాలు ఎలా
పెద్ద
సహాయకారిగా అవుతాయో కదా.
మనం
చిన్నప్పుడు నేర్చుకునే చెట్లు
ఎక్కటం,
ఈతకొట్టటం, వేగంగా
పరిగెత్తటం, చేతులు
నోటి
ముందుపెట్టుకుని పెద్దగాఅరవటం, తదితర
విషయాలు మనకు
జీవితంలో ఎప్పుడో ఒక్కప్పుడు అవసరానికి ఉపయోగపడవచ్చు. చిన్నతనంలో పిల్లలు వారి
వారి
అభిరుచులను పట్టి
ఎన్నో
కళలు
నేర్చుకుంటారు. మన
దౌర్భాగ్యం ఏమిటంటే ప్రస్తుతం బాల్యం
నాలుగు
గోడలమధ్యన సెల్పోను తోటి
గడుస్తుంది. పిల్లలలో సృజనాత్మకత అభివృద్ధి కావటంలేదు, మానవసంబందాలు ఏర్పడటంలేదు. ఇది
ఇట్లావుండగా పిల్లలకు తలకు
మించిన
భారంగా
పుస్తకాలు, పాఠశాలల, కళాశాలల మధ్య
పోటీతో
పిల్లలను బలిచేస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ
పిల్లలు అందరికంటే ఎక్కువ
మార్కులు రావాలనే తాపత్రయంతో వారి
సంతోషాలను, ఆనందాలను బలి
తీసుకుంటున్నారు. మన
పిల్లలను రౌజులో ఒక
గంట
అయినా
బయట
తోటి
పిల్లలతో ఆడుకునేటందుకు ప్రోత్సహించాలి. ఆదివారాలు, శలవుదినాలలో పిల్లలతో కలిసి
సినిమాలకు, చుట్టుప్రక్కల ప్రదేశాలను చూడటానికి అనుమతించి వారిలో
వ్యక్తిత్వ వికాసం
పెంపొందటానికి తోడ్పడాలి. కొన్నిసందర్భాలలో అనిపిస్తుంది పిల్లలను అతి
ప్రేమగా చూడటం
వారి
అభివృద్ధికి గొడ్డలి పెట్టు అని.
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి