9, సెప్టెంబర్ 2024, సోమవారం

నాటి జ్ఞాపకాలు

 పాతికేళ్ళ క్రితం...నాటి జ్ఞాపకాలు


1999 డిసెంబర్ 18 న నాకు ఖమ్మం తో..నాకు గల.సంబంధం కు అనుబంధ బాంధవ్యానికి ఒక ప్రత్యేకత ఉంది.

"కంభంమెట్టు "గా మా తాతగారు ఎప్పుడూ అనే ఖమ్మంలో పది..పన్నెండు కు పైగా బంధువుల కుటుంబాలు ఉండేవి.

డిసెంబర్ 18 న నా వివాహం ఖమ్మం కు చెందిన స్వర్గీయ రాళ్లబండి లక్ష్మీ నారాయణ (R.L నారాయణ రిటైర్డ్ డిప్యూటి కలెక్టర్. ) గారి చిన్న కుమార్తె శ్వేత తో జరగటం..మా ఇల్లాలు పెద్దన్నయ్య రాళ్లబండి ప్రసాదరావు బావగారు ఉద్యోగరీత్యా వరంగల్లు లో ఉండటం వల్ల పెళ్ళైన కొత్తలో వరంగల్ వెళ్ళవలసి వచ్చింది..


 💐 ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నైన ,నాకు అప్పటి వరకు వరంగల్లు తో పరిచయం తక్కువ..

 సాధారణంగా ఖమ్మం నుండి వరంగల్ కు ఎక్కువ గా రైలు లో నే అధికంగా ప్రయాణిస్తారు.. ఉదయం శాతవాహన../ గోల్కొండ ...మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్ లు ..

2000 జనవరి సంక్రాంతి సెలవుల్లో మధ్యాహ్నం వరంగల్లు వెళ్లాలనే ఆలోచన వచ్చి కోదాడు నుండి ఖమ్మం వెళ్ళేవరకు కృష్ణా ఎక్స్ప్రెస్ వెళ్లిందని తెలిసి బస్సు పై వరంగల్లు వెళ్ళ దలిచాను...


 💐 బస్సు లో నేను ఎప్పుడు ఎక్కినా, ముందు సీట్లు ఖాళీగా ఉన్నా ,,కిటికీ ప్రక్కన సీటు ఉంటే చివరాఖరి సిటు వరకైనా ,వెళ్ళటం నా అలవాటు..మహిళలకు కేటాయించిన వాటిలో ముందు 5 వరుసలలో అసలు కూర్చోను. 

  * కిటికి ప్రక్కన కూర్చొని చల్ల గాలి ని ఆస్వాదిస్తూ. పచ్చటి ప్రకృతిని చూస్తూ ..ఒక్కోసారి డ్రైవర్ హెచ్చరికల తో కూడిన చివాట్ల ను సైతము తింటూ నైనా ,చేతులు గాలిలో ఆడించటము నా అలవాటు..

 ఆ రోజు నా బస్సు ప్రయాణం సాగింది..ఇలా.

..

**బస్సులో ఆరవ వరుస సిట్లో కూర్చున్నా... కిటికి ప్రక్క..

నా అదృష్టం వల్ల తొర్రూరు వరకు పెద్దగా జనం ఎక్కలేదు.

** తొర్రూరు బస్టాండ్ దాటగానే ఎనిమిది మంది బృందం బస్ ఎక్కారు వాళ్లలో ఇద్దరు మహిళలు..ఆరుగురు మగవాళ్ళలో డెబ్భై ఏళ్ల పై బడిన వాళ్ళు ముగ్గురు మిగితా వాళ్లంతా..నడి వయసు వాళ్ళు..

** బస్ ఎక్కి వాళ్లంతా నావైపు వస్తుంటే నాలో ఆందోళన మొదలైంది..

** ఇద్దరు ముసలివాళ్ళు తాంబూల సేవనం చేసినట్లు అనిపించడం..నా సిటు దిశగా రావడం...

సహజంగా పెద్దవాళ్ళు ప్రక్కన కూర్చుంటే..కిళ్లీ నోట్లో ఉంటే కిటికీ సిటు ఇవ్వాల్సి వస్తుందని...నా భయం!..

 వెంటనే గాఢ నిద్రలో ఉన్నట్టు నటించి మధ్య.. మధ్య..పరిశీలించగా..ఇంచుమించు మా తాతగారి లాగే పొడవాటి గడ్డం తో. ఉండి నా ప్రక్కనే తిష్ట వేసిన పెద్దమనిషి...నన్ను లేపాలని ప్రయత్నించి విఫలమయ్యాడు...

"** "నిద్రిస్తున్న వారిని సులువుగా లేపవచ్చు ,కానీ నటిస్తున్న వారిని లేపటం ఎవరి తరం..!"


 కానీ ఓరకంటి తో మధ్య మధ్య ఆయన వైపు చూస్తుంటే..తుప్పెర్ల వర్షం లో తడిసిపోతానే మో!, నని జడుసుకుని ఒక్కసారిగా గాఢ నిద్రలో నుండి లేచిన వాడిగా జీవించా.!

.పాపం ఆ పెద్దాయన నేను ప్రక్కకు జరగడం వెంటనే కిటికీ నుండి ఉమ్మివేయటనికి నా మీది నుండి వంగడం అప్రయత్నంగా జరిగింది.

 ** టికెట్ల కోసం వచ్చిన కండక్టర్ ఆరు టికెట్లు మాత్రమే ఇవ్వడం ఇద్దరు freedom fighters అని తెలవడం... తో నేను వాళ్ళతో మాటలు కలిపా...

 💐* తామ్రపత్ర పురస్కార గ్రహీత స్వాంతత్య్ర సమరయోధుడూ అయిన మా తాతగారైన "గణపతి శాస్త్రి "గారి ప్రస్తావన వారి తో తెచ్చా.!..


నా ప్రక్కనున్న పెద్దాయన తో నా సంభాషణ సాగింది ఇలా...


అతను : నువ్ ఏం చేస్తవ్ ?


 నేను : (పైకి ) తెలుగు లెక్చరర్ గా! ...{ (మనసులో ) నీ కెందుకయ్యా ? }


అతను: యాడ చదువుకున్నవ్ ?


నేను: హైదరాబాద్ లో!


అతను : సాహిత్యం లో ఎవరెవరు ఇష్టం ?


నేను : {(మనసులో )వాళ్ళ పేర్లు నీకు చెప్పినా నీకేం తెలుసు...} ( పైకి మాత్రం ) ... శ్రీనాథుడి సీసాలూ !. ధూర్జటి శతకాలు.. గురజాడ అడుగుజాడలు.. విశ్వనాథ సాహిత్యమంతా..! .(అంటూ..ఛాన్స్ దొరికిందని బడాయి తో లెక్చరిచ్చా.!..)


అతను : పజ్యాలు గిట్ల రాయుడు వచ్చునా..!


నేను: పెద్దగా రాదు గానీ.. పద్యమంటే తెగ యిష్టం

పద్యం -- హృద్యం... వచనానిది ఏముంది ? వెంటనే పచనమైతది..


అతను : ..........................


నేను : .............................


 💐 ఇంతలో వరంగల్ వచ్చింది . నా గురించి గొప్పలు చెప్పుకున్న గానీ మీరెవరు..మీరేం చేస్తారు అని కనీసం అడిగే ప్రయత్నం కూడా చేయలే...

💐💐 వరంగల్ దాటి హన్మకొండ దిశగా బస్సు దూసుకొనిపోతున్నది...

నక్కలగుట్ట అనే ప్రాంతం వచ్చేవరకు దిగుదామని అనుకుని వాళ్ళు ఎందుకో విరమించుకొని హన్మకొండ బస్ స్టేషన్ లొనే దిగారు..వాళ్ళు దిగిన వెంటనే నేను దిగాను.. వాళ్లకోసం ఒక అంబాసిడర్ మరో ఆటో సిద్ధంగా ఉన్నాయి..కండక్టర్ స్వయంగా కారు దాకా ఆ పెద్దాయన తోడు గా వెళ్ళి తిరిగి వస్తుంటే...

 ఎవరై ఉండవచ్చు ఈయన అని అడిగా ఆయన్నే..

 ఆయన చెప్పిన మాట విని నా నోట మాట రాలేదు ఒక క్షణం..

 వెంటనే.. తెరుకున్నా...

💐 "ప్రజాకవి కాళోజి నారాయణరావు "గారు 💐 వారని...వారితో ఒక గంటన్నర కలిసి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేశానని తెలుసుకొని నిశ్చేష్టుడను అయ్యా !

.. వెంటనే "పి.టి.ఉష "లా పరిగెత్తి కారు ను సమీపించి "కాళోజీ ! గారి చేతులు పట్టుకొని "అయ్యా ! మిరెవరో తెలియక మిమ్ములను ఈ మన ప్రయాణం లో , మనసుకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించి ఉంటే ,మన్నించండి" అని అన్నా!..

వారు నవ్వుతూ నా భుజం పై ఆప్యాయంగా చేతులు వేసి... నా వీపు పై తట్టి " నువ్వేం తప్పు జేయలే..!" అన్నాడు..


💐💐 నా భార్య చదువుకున్న కాకతీయ జూనియర్ కాలేజి ప్రక్కనే కాళోజి గారి ఇల్లు అని చెప్పగా మరుసటిరోజు వారి ఇంటికి వెళ్ళా...

వారు స్వయంగా ఇచ్చిన వారి ముద్రిత రచనలు ఇప్పటికీ మా పుస్తకాలయం లో కొలువై ఉన్నై..

💐 వారు మరణించారని తెలిసినప్పుడు కృష్ణా జిల్లలో పనిచేస్తున్న నాకు వారి అంతిమయాత్ర పాల్గొనాలి అని అనిపించింది...

వారు తన భౌతిక కాయాన్ని కాకతీయ మెడికల్ కాలేజి కి డొనేట్ చేశారని తెలియగానే...అదే కళాశాలలో MBBS. చేస్తున్న మా మేనకోడలి కి ఫోన్ చేసి రూడీ పరచుకొని ఒక వారం లోపు వరంగల్లు వెళ్లి కడసారి గా నివాళులు అర్పించా...

💐 మా గురువుగారు కొండపల్లి రామనుజరావు గారికి కూడా కాళోజి గారితో కలిసి బస్సులో ప్రయాణం చేసిన అనుభవం గురించి ఇవ్వాళ సాయంత్రం అయిదు గంటల కు నాకు చెప్పేవరకు..

కాళోజీ గారి జయంతి సందర్భంగా...నా గతస్మృతులు..ఇలా మీ తో పంచుకొంటున్నా..

కామెంట్‌లు లేవు: