22, అక్టోబర్ 2023, ఆదివారం

ఆలోచనాలోచనాలు

 ***** ఆలోచనాలోచనాలు ***** సంస్కృత సూక్తి సుధ *****                            1* న ధార్మికే న సేద్గ్రామే.         నవ్యాధి బహుళే భృశమ్,       నైవః ప్రపద్యే తాధ్వానం.        నచిరం పర్వతే వసేత్!!          ధర్మాత్ములు లేనట్టి గ్రామంలో నివసించకూడదు. ఏదైనా భయంకరమైన వ్యాధి ప్రబలిన ఊరిలో కూడా ఉండకూడదు. ఒంటరిగా దారిన నడవరాదు. కొండలమీద చాలాకాలం నివసించరాదు.                      2*ఉపాన హవుచ వాసశ్చ     ధృత వన్నైర్త్న ధారయేత్,      ఉపవీత మలంకారం.               స్రజం కరక వే వచ!!                ఒకరు తొడుక్కునే కాళ్ళచెప్పులు మరియొకరు వాడుకోగూడదు. ఒకరి వస్త్రములు మరియొకరు ధరించరాదు. ఒకరి యజ్ఞోపవీతాన్ని( జందేన్ని) మరొకరు వాడరాదు. అట్లాగే ఒకరు ధరించిన పూలమాలలను వేరొకరు ధరించరాదు. ఒకరి కమండలాన్ని వేరొకరు వాడుటకూడా పనికిరాదు.     3* నైక స్వస్స్యాచ్చూన్న గేహే.                                    శయానాం నప్రధర్షయేత్,       నో దక్యాయాఽభి భాషేత.       యజ్ఞం గచ్ఛేన్న బాహృతః!!                             ఎవ్వరూ లేని ఇంటిలో ఒంటరిగా నిద్రించకూడదు. నిద్రించేవ్యక్తిని అకారణంగా నిద్ర లేపకూడదు. బహిష్టు అయిన స్త్రీతో సంభాషణ పనికిరాదు. పిలువకుండా యజ్ఞం జరిగే ప్రదేశానికి వెళ్ళకూడదు.                       4* లోష్టమర్దీ తృణచ్చేదీ         నఖ ఖాదీచ యోనరః.           సవినాశం ప్రజత్యాశు.           సూచకో శుచిరేవచ!!              మట్టిపెళ్ళలను నలిపేవాడు, గడ్డిపరకలను త్రుంపేవాడు, గోళ్ళు కొరుక్కొనేవాడు, ఎప్పుడూ ఎవరో ఒకరిపై చాడీలు చెప్పేవాడు, అపరిశుభ్రంగా ఉండేవాడు వీరు వృద్ధిలోకి రారు. ( ఈ వినాశకరమైన పనులు చెయ్యరాదని భావం.)                                 5* నవిగన్హ్య కథాం కుర్యా.      ద్బహిక్మాల్యం నధారయేత్,  గవాంచయానంపృష్ఠేన.          సర్వన్తవవిగర్హితమే!!             నింద్యమైన ప్రసంగాలు చెయ్యకూడదు. వాడి తొలగించిన పూలమాలను ధరించకూడదు. ఎప్పుడైనాసరే ఎద్దుపై ఎక్కి ప్రయాణం చెయ్యకూడదు. ( ఈ పని ఒక్క ఈశ్వరునికి మాత్రమే చెల్లుతుంది.)           6* అద్వారేణచ నాతీయా.    ద్గ్రామం వాకవేశ్మవావృతమ్,               రాత్రేచ వృక్షమూలాని.           దూనతః పరివర్జయేత్!!           గ్రామానికి కానీ, ఇంటికి కానీ, ప్రధాన ద్వారం మూసివేసి ఉన్నప్పుడు మారు త్రోవగుండా వెళ్ళకూడదు. రాత్రివేళల యందు చెట్ల మొదట్లో కూర్చోవడం గానీ, పడుకోవడం గానీ చెయ్యకూడదు. వీటివల్ల ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువ.           చివరగా ఒక చమత్కార శ్లోకం-----                              ఇది ఒక ఏకాక్షర శ్లోకం.              రరో రరే రర రురో రురూ రూరు రురో రరే !                    రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!                            ఇక ఈ శ్లోకానికి అర్థాన్ని అన్వేషిద్దాం.                           ర= రామ శబ్దంలోని 'ర' రేఫవలన.                              రోః = భయం కల.                  అర = వేగంగా పరుగెత్తే.        రురోః = జింకయైన మారీచునికి.                          అరేః = శత్రువైన శ్రీరాముని.     రేరే = (ర+ఈరే)= కౌస్తుభమణిని పొందివున్న     ఉరో రరే = వక్షము నందు.      రీరారా = లీల నాపాదించునట్టి.                    ఊరూరుః = ఊరువులచే గొప్పనైన                               ఉః = లక్ష్మి= సీతాదేవిని           అర రర = తన నివాసానికి తీసుకెళ్ళిన.                           ఇరార = లంకను పొందిన.      ఇరారి = భూమికి శత్రువైన ' రావణుని'కి.                            రిః = నాశనం కల్గించినదై.      అరిరా = చెలికత్తెలను            రా = పొందినదాయెను.         ( శ్రీరామ పత్ని సీతాదేవి లంకలో రావణ వినాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెలను పొందిందని భావం.)                                 తేది 22--10--2023, ఆదివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: