22, అక్టోబర్ 2023, ఆదివారం

శ్రీధరీయం 60

 🌹శ్రీధరీయం 60 🌹


బాలాంబకు దనుజౌఘ

జ్వాలాంబకు నాదు చిత్త భద్రాలయకున్ 

రోలంబాలకకున్ నిజ 

లీలా లాలిత లలితకు శ్రీధరి సుతకున్


శ్రీమాతుః ప్రియ పుత్రికాం ,నవసమాం 

బాలార్క తేజోవిభామ్

బీజ త్రైపుర వాసినీం ,సువిమల 

శ్వేతాంబరాం వాక్ప్రదాం

జాగ్రత్ స్వప్న సుషుప్తిగాం ,త్రిపురగాం ,

శ్వాసై ర్మరాళై ర్వహాం

నౌమి త్వాం లలితాత్మజాం, ఘనరణాం.

బాలాంబికాం శ్రీధరీమ్.


🌹మణిశింజిని 🌹

లలితా త్రిపుర సుందరి వయస్సు 16 ఏళ్ళయితే ఆమెపుత్రిక అయిన బాలాత్రిపురసుందరి వయస్సు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే.ఉదయిస్తున్న బాలసూర్యునవలె ఎఱ్ఱగా ప్రకాశిస్తూ.ఉంటుంది.

ఐం క్లీం సౌః అనే 3బీజాక్షరాలే చిన్నతల్లి నివాసం.అందులో మొదటి ఐంకారం సరస్వతీ బీజాక్షరమే.కనుక బాలమ్మ విద్యాప్రసాదిని.ఎప్పుడూ స్వచ్ఛమైన తెల్లని వస్త్రం ధరించిఉంటుంది.ఇదికూడా శారదా లక్షణమే. జాగ్రదాది అవస్థాత్రయం లో ఉంటూ  అవి ఆంటకుండా తురీయావస్థలో ఉండే జ్ఞానశక్తే బాలాంబ అంటే.ఈతల్లిని యుద్ధానికి పంపిస్తూ లలితాంబ తన హృదయం నుండీ కర్ణీరథాన్ని పుట్టించి యుద్ధభూమిలో స్వేచ్ఛగా తిరగడం కోసం హంసల్ని ఆరథానికి గుఱ్ఱాలుగా ఏర్పటుచేసింది.

అవి మనలోని ఉచ్ఛ్వా నిశ్వాసలే.హృదయంలోని రక్తాన్ని శుభ్రంచేసే వాయువులవే.తద్వారా

🌹 బలంతి ప్రాణినః అనయా 🌹అన్నవ్యుత్పత్తిలో బాలాశబ్దం ఏర్పడుతోంది.ఆతల్లి భండాసుర పుత్రులతో చేసేయుద్ధంలో రణనిపుణ వలే  మెరుపులా మెరుస్తూ భండపత్రుల్ని నశింపజేసింది.శ్రీధరి ఐన బాలాంబకు నమస్కారం.

    🌹🙏 ధూళిపాళ మహాదేవమణి 🙏🌹

కామెంట్‌లు లేవు: