꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂
🙏 *ఓం నమో వెంకటేశాయ* 🙏
*తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు*
꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅••••••••♾️꧂
అధ్యాత్మ సంకీర్తన. 2708. 22-10-23
రేకు: 172-1
సంపుటము: 2-350
రాగము: ప్రతాపనాట
ఏమని నుతించవచ్చు నితనిరూపము
భీమవిక్రముఁ డితఁడు పెద్ద హనుమంతుఁడు
॥పల్లవి॥
వొక్కజంగఁ చాఁచినాఁడు వొగిఁ దూర్పుఁబడమర
తక్కక భుజా లుబ్బించె దక్షిణోత్తరాలు నిండ
మిక్కిలి బ్రహ్మలోకము మీరను శిరసెత్తెను
పిక్కటిల్లు మహిమతోఁ బెద్ద హనుమంతుఁడు
॥ఏమ॥
వేడుక వాల మాకాశవీథితోఁ బెనచినాఁడు
యేడుజలధులు చేసె నదె మోకాళ్లబంటి
వోడక పిడికిలించి వుగ్రదైత్యుల తలలు
బేడలుగాఁ జేసినాఁడు పెద్ద హనుమంతుఁడు
॥ఏమ॥
జళిపించి వలకేలు సకలము మెచ్చ నెత్తె
కులగిరులు తనతొడలసందినే యడఁచె
బలువుఁడు శ్రీవేంకటపతిబంటు మతంగాద్రి-
బిలమువాత నున్నాఁడు పెద్దహనుమంతుఁడు
॥ఏమ॥
*సేకరణ :సూర్య ప్రకాష్ నిష్టల*
꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅••••••♾️꧂
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి