శ్రీమాత్రేనమః
*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
ది:22-10-2023
శా॥
భృత్యుల్ నీకు శివుండు బ్రహ్మ హరియున్ ప్రేతల్ విచారించ; నా
దిత్యవ్రాతము సేవజేయ విలసత్తేజమ్ము దీపించ నీ
స్తుత్యమ్మైన పరాక్రమం బసురసందోహమ్ములం గూల్చెనే
యత్యుత్సాహముతోడ నిన్ గొలుతు నిత్యానందసంధాయినీ! -15
శా॥
సర్వాధారగుణోజ్జ్వలీ! శుభకరీ! సర్వార్థదాత్రీశ్వరీ!
సర్వైశ్వర్యవిరాజమానకుశలజ్జాజ్వల్యతేజోనిధీ!
సర్వానందకరీ! భవార్తిశమనీ! సౌందర్యరూపార్ణవీ!
సర్వజ్ఞానకరీ! నమోస్తు! హరహృత్సౌందర్యవర్థఙ్కరీ! 16
శా॥
అంతర్యాగముచేత సత్వరముగా నానందముం బొంది నీ
పొంతన్నిల్పుక యాదరింతువట సమ్మోదమ్మునన్ శ్రీకరీ!
భ్రాంతుల్ బాపుచు జ్ఞానమీయుమిక క్షేత్రమ్మేల నీవుండగా!
క్రాంతిం జూపుమ దానవాంతకమతీ! కైమోడ్పులర్పించెదన్ 17
(క్షేత్రము=శరీరము)
*~శ్రీశర్మద*
8333844664
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి