*ద్విజేభ్యోనమః*
ఎన్నో జన్మల సత్కర్మఫలంగా లభించునది ద్విజన్మ సౌభాగ్యం., అందులో బ్రాహ్మణ జన్మ మరింత పుణ్యఫలం. బ్రాహ్మణుల ను భూసురులు అంటారు, అంటే భూలోకంలో దేవతామూర్తులు అని అర్థం. కానీ బ్రాహ్మణులు అంటే ఎవరు!!?? బ్రహ్మ జ్ఞానసంపన్నులు. అయితే బ్రహ్మ సూత్రం (యజ్ఞోపవీతం) ధరించి యుండి త్రికాల సంధ్యావందనం, షట్కర్మాచరణం(యజన,యాజన,దాన,ప్రతిగ్రహణ,అధ్యయన,అధ్యాపనములు) చేయువారు. అంటే దీనంతటికీ ప్రాధమిక సూత్రం యజ్ఞోపవీతం., అయితే ఈనాడు ఎందరో బ్రాహ్మణుల కు కూడా యజ్ఞోపవీతం ఎలా తయారు చేయాలో దాని వివరాలేమిటో తెలియకపోవడం దురదృష్టకరం.
యజ్ఞోపవీతం అనేది ఒక ద్విజుని శారీరక నాళికా గ్రంథుల పొడవు (ఇది 3×96= త్రిమూర్తిత్వము,3× 4 వేదములు ×గాయత్రీ మంత్రమందలి అక్షరాలు,24) బెత్తల కొలతలో ఉంటుంది.). ఇది ప్రతి ఒక్కరికీ వారి కొలతలపై ఆధారపడి ఉంటుంది., అంటే ఎవరు ధరించే యజ్ఞోపవీతం వారే స్వయంగా నిర్మించుకొనవలసి ఉంటుంది. ఈనాటి తరానికే ఇది తెలియక పోతే భావితరాలకు ఎలా తెలుస్తుంది!??. స్వయంగా కనీసం దారం నుండి యజ్ఞోపవీతం తయారు చేసుకోవడం అయినా అలవాటు చేసుకుంటే భావితరాలకు భూసురరక్షణ చేయవచ్చు. దీనికొరకై సులభంగా యజ్ఞోపవీతం తయారు చేసుకునే ఎలక్ట్రానిక్ యంత్రాన్ని మేము రూపొందించాము. ఇది పవర్ బ్యాంకు పై కూడా పనిచేస్తుంది.
*దైవాధీనం జగత్సర్వం*
*మంత్రాధీనం తపః ఫలమ్*
*తన్మంత్రం బ్రాహ్మణాధీనమ్*
*బ్రాహ్మణో మమ దేవతాః*
ఇది శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి న మాట. ఇలా మంత్రం బ్రాహ్మణాధీనం కావాలంటే,సత్ఫలితాలను ఇవ్వాలంటే బ్రాహ్మణులు ధరించే యజ్ఞోపవీతం ఖచ్చితమైన ది అయి ఉండాలి. అందుకే మా ఈ ప్రయత్నం.
*కొంపెల్ల శ్రీనివాస శర్మ*,
*9492050200*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి