22, అక్టోబర్ 2023, ఆదివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 61*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 61*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*అసౌ నాసావంశ స్తుహినగిరి వంశ ధ్వజపటే*

*త్వదీయో నేదీయః ఫలతు ఫల మస్మాకముచితమ్ |*

*వహత్యంతర్ముక్తా శ్శిశిరకర నిశ్వాస గలళితాః*

*సమృద్ధ్యా య త్తాసాం బహిరపి స ముక్తామణిధరః ‖*


అమ్మా

తుహినగిరివంశ ధ్వజపటే = హిమవంతుని వంశ కీర్తి పతాక అయిన తల్లీ!


అసౌ నాసా వంశః = లేత వెదురు ముక్క(వంశః) వలె వున్ననీ నాసిక, (ఇది కవి చమత్కారం.బాగా పండిన వెదురులో ముత్యములు పుడతాయట. అలాగే వెదురు పచ్చగా వుండి, లోపల బోలుగా ఉండటంతో దీనిని నాసికాదండముతో పోల్చారు. వేణువును వంశి అంటాము కదా.


వహత్యంతర్ముక్తా శ్శిశిరకర నిశ్వాస గలితం, సమృద్ధ్యా యత్తాసాం బహిరపి స ముక్తామణిధరః =

ముక్తాః అంటే మంచి ముత్యము. అలాగే ముక్తులైన వారు అని కూడా అర్థం. అమ్మా, నీ నాసికలో ఎన్నో ముత్యాలు లోపల ఉంచుకొని ఒకటి బయటకు ధరించావా తల్లీ అని భక్తితో అడుగుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు.

ఒకటి నాసిక బయట ధరించిన ఆభరణానికి లోపల కూడా ఒక ఆభరణం ఆసరాగా పట్టుకొని ఉంటుంది.

 రెండవది ముక్తి పొందినవారు ఎందరో మహా యోగులు అమ్మవారిలో లీనమై ఉన్నారు. ఈ విషయం నిరూపించటానికా అన్నట్లు ఒక ముత్యమును బయట ధరించారు. అమ్మవారు మనలో ప్రాణశక్తిగా సంచరిస్తున్నారు. ఉచ్చ్వాస నిశ్వాసములలో. నిశ్వాసము చంద్ర స్వరూపమైన ఇడా నాడి (శిశిరకర  నిశ్వాస అన్నారు అందుకే) ద్వారా వెలువడుతుంది. అలా వెలువడిన నిశ్వాసముతో బయటకు వచ్చిన ముత్యము ఆమె నిశ్వాసము, శశికరుడైన చంద్రుని స్థానమైన ఇడా నాడి నుండి వచ్చినప్పుడు అమృత బిందువులు జాలువారుతాయి, అవి ఘనీభవించి ముత్యములుగా మారుతాయి అని కవి చమత్కారం. అమ్మవారు ఆభరణముగా ధరించారట. ముత్యము కూడా చంద్ర స్వరూపమే. ముత్యములు ఆలుచిప్పలలోనూ, గజరాజుల కుంభస్థలములలోనూ కూడా లభిస్తాయి. రాబోయే 74 వ శ్లోకంలో, శివుడు గజాసురుని సంహరించి, వాని కుంభస్థలము నుండి సేకరించిన ముత్యములతో చేసిన మాలను అమ్మవారికి బహుకరించారని చెప్పబడుతుంది. 


లలితా సహస్ర నామములలోని *నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితా*, *తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా* అనే రెండు నామములు ఇక్కడ స్మరింపదగినవి.  ఈ నామముల అర్థము

అప్పుడే విచ్చుకున్న చంపక పుష్పము వలె అమ్మవారి నాసాదండము విరాజిల్లుతున్నది. అమ్మ ధరించిన నాసాభరణము నక్షత్రకాంతిని  త్రోసిపుచ్చుతున్నది అని. 

కుడి ప్రక్కన సూర్య సంబంధమైన పింగళ నాడి, ఎడమ ప్రక్కన చంద్ర సంబంధమైన ఇడా నాడి, మధ్యన అగ్ని సంబంధమైన సుషుమ్న నాడి. పార్వతీ పరమేశ్వరుల త్రినేత్రములు కూడా వీరి స్థానములే.


          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: