ఈ #శార్వరీ నామ సంవత్సరంలో #అధికమాసం_లేదు
ఈ సంవత్సరం లో అసలు అధికమాసం అనేది లేదు. అదేమిటి అలా అంటారు? పంచాంగాలన్నీ అధికమాసం రాసాయి కదా! అంటారేమో! రాసాయి, నిజమే. అయితే, అది సశాస్త్రీయం కాదు అని జ్యోతిష సిద్ధాంతగ్రంధాధ్యయనం ద్వారా అవగతమౌతుంది. అసలు సిద్ధాంతజ్యోతిషం పై అవగాహన లేనివారికి కూడా సులభంగా అర్థమయ్యే లా వివరించే ప్రయత్నమే ఈ పోస్ట్.
📌అసలు #అధికమాసం అంటే ఏమిటి?
ఏ నెలలో సూర్య సంక్రమణం జరుగదో ఆ నెల అధికమాసం. అయితే, సంక్రమణం అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. రవి ఒకరాశి నుండి వేరొక రాశి లోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. సూర్యభగవానుని సంక్రమణం జరుగనిదే ఆ మాసానికి పవిత్రత చేకూరదు.
ఈ సంవత్సరం లో అధికమాసం రాసిన వారికి, వారి వారి గణితానుసారం సంక్రమణం జరుగలేదు, కాబట్టి వారంతా ఆశ్వయుజం అధికమాసం రాసారు.
#సంపూర్ణ_దృగ్గణితరీత్యా పంచాంగగణితం చేస్తే ఈ సంవత్సరంలో సంక్రమణాలు అన్నీ జరుగుతున్నాయి, కాబట్టి ఈ సంవత్సరంలో అధికమాసం లేదు.
📌మరి, మిగిలిన వాళ్ళంతా #ఎందుకు రాసారు?
ఎందుకంటే వారి గణితం లో తేడా కాబట్టి.
📌మీ గణితంలో తేడా లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు?
సిద్ధాంతగ్రంథానుసారం వర్తమాన గ్రహ స్థితిని అనుసరించి గణితంలో ఏ సంస్కారాలు చేసుకోవాలో (necessary corrections as per the changes in the motion of the planets) అవన్నీ మేము చేసుకోవడం జరిగింది. మిగిలినవారు అలా చేయలేదు. వివరాలు నేను లోగడ ఇంగ్లీష్ లో పెట్టడం జరిగింది. లింక్ ఇది, చదవండి 👇
https://m.facebook.com/story.php?story_fbid=2063413727038331&id=100001091702745
📌 అయితే, మిగిలిన పంచాంగాలవారు తేడా చేస్తున్నారని లోగడ చెప్పిన వారెవరైనా ఉన్నారా?
ఉన్నారు. అందులో #లోకమాన్య_బాలగంగాధర_తిలక్ కూడా ఉన్నారు. ఆయన సమయంలో వారు గణితంలో సవరణలు చేసి #తిలక్_పంచాంగ్ పేరుతో ప్రచురించడం ప్రారంభించారు. నేటికీ ఆ పంచాంగం పూనా నుండి ప్రచురింపబడుతూ ఉన్నది. వారికీ ఈ సంవత్సరం అధికమాసం రాలేదు.
రవి సంక్రమణాలలో మూడున్నర రోజుల తేడా వస్తోంది. 1925 లో పూనాలో పంచాంగకర్తలంతా సమావేశమై ఆ సంవత్సరానికి అయనాంశ లను 22° 40` 39`` గా తీసుకోవాలని నిర్ణయించారు. అది తప్పని తిలక్ గారు గ్రహించి సవరణ లతో తన పేరుతో పంచాంగం ప్రచురించడం ప్రారంభించారు.
1950వ దశకంలో #మద్రాసు_సంస్కృత_కళాశాల లో ప్రొఫెసర్ అయిన TS Kuppanna Sastry గారు తమ పరిశోధనా వ్యాసాలు ఎన్నో ప్రచురించారు. వాటిని ఒక పుస్తకరూపంలో మా యూనివర్సిటీ ( National Sanskrit University) ప్రచురించింది. Collected Papers on Jyotisha అన్న పేరుతో 1989 లో ప్రచురణ చేసింది. ప్రస్తుతపంచాంగాలన్నీ సంక్రాంతులను 3 1/2 రోజులు వెనకకు చూపించాలని రాసారు. అయితే, శాస్త్ర భీతి లేకపోవడం వలన పంచాంగకర్తలెవరూ అది పట్టించుకోలేదు. మా జ్యోతిషపరమగురువులు శ్రీపాద వేంకటరమణ దైవజ్ఞశర్మ గారు 1945 నాటికే ఈ విషయాన్ని గ్రహించి, తదనుగుణంగా సవరణలు చేయడం, మద్రాసు యూనివర్సిటీ లో దీనిపై ఉపన్యసించడం జరిగింది. వారి శిష్యులు, అస్మద్ గురువర్యులైన మ. మ. మథుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆ గణితాన్నే అనుసరించి పంచాంగప్రచురణ ప్రారంభించారు.
నా అదృష్టం కొద్దీ నేను దానిని అభ్యసించడం జరిగింది.
సవరణలు చేయని ఈ పంచాంగాలన్నీసంక్రాంతి పండుగ జనవరి 13/14/15 తేదీలలో రాస్తున్నాయి. కానీ, అసలు సంక్రాంతి జనవరి 10/11/12 తేదీలలో అయిపోతోంది. అందువల్ల వారి అధికమాసం లెక్కలు సశాస్త్రీయగణితం కాదని గ్రహించాలి. TS Kuppanna Sastry గారు కూడా ఈ సంక్రాంతులలో తేడాలను వివరించిన పేజీని కూడా ఫొటో తీసి పోస్ట్ లో పెట్టాను. ఇంగ్లీష్ లో ఉంది చదవండి.
✍Dr. Tukaram
సేకరణ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి