*****
*శ్లో:- అపూజితో౽ తిథిర్యస్య౹*
*గృహాత్ యాతి వినిశ్వసన్ ౹*
*గచ్ఛన్తి విముఖా: తస్య ౹*
*పితృభి స్సహ దేవతాః ౹౹*
*****
*భా:- తిథి, వారము,నక్షత్రముల నిమిత్తము లేకుండా ఆకస్మికంగా వచ్చే వారిని "అతిథి" అని అంటారు. "అతిథి దేవో భవ" అనేది మన సనాతన సాంప్రదాయము. "అతిథియే దేవుడుగా కలవాడివి కమ్ము" -అని దీని అర్థము. ఇంటికి వచ్చిన అతిథిని అర్ఘ్య పాద్యాదులతో పూజించి తృప్తిగా గారవించాలి. నేటి పరిస్థితి దీనికి భిన్నంగా మారిపోయింది. ఆతిథ్యం ఇచ్చినా యాంత్రికంగా ఉంటున్నది. ఎవరి ఇంట్లో "అతిథి" గౌరవమర్యాదలు పొందకుండా, నిరాశా నిస్పృహలతో వెను తిరిగి పోతాడో , అటువంటి గృహస్థుని ఇంటినుండి ఆ అతిథితో పాటు, మనలను ఆశీర్వదించడానికి వచ్చిన ఇష్టదేవతలు, కులదేవతలు, పితృదేవతలు కూడా విముఖులై, అసంతృప్తితో వెళ్ళిపోతారు. వారి అనాదరణ కారణంగా ఆ ఇంటిలో శుభం కలుగదు. అడుగడుగునా యేవో చిక్కులు, చీకాకులు, సమస్యలు,వైమనస్యాలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఇంటికి వచ్చిన అతిథిని సముచితంగా ఆదరించి, గౌరవించాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అనే సూత్రాలను పాటిస్తూ, ధర్మాచరణ పరాయణులమై శుభప్రదంగా, మంగళప్రదంగా సుఖ జీవన యానం చేయాలని సారాంశము.*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి