ఆటకి, కర్మకి ఒక్కటే తేడా. ఫలం యొక్క ఆకాంక్ష ఉంటే ఆట కూడా ఒక కర్మ అయిపోతుంది. ఆకాంక్ష లేకపోతే కర్మ ఒక ఆట అవుతుంది. కాబట్టి "ఆకాంక్ష" అనేది కర్మకి, ఆటకి మధ్యగల తేడా.
ఎవరు కర్మలో ఆకర్మని, ఆకర్మలో కర్మని చూస్తారో వారు జ్ఞాని. కర్మలో ఆకర్మని చూడడం అంటే కర్మ చేస్తూ, నేను కర్తని కాదు అని అనుకోవడం. ఎప్పుడైతే ఒక సాక్షీభావం ఉంటుందో, అప్పుడే కర్మ చేస్తున్నా నేను కర్తని కాదు అనే భావన కలుగుతుంది. ఇక రెండోది కర్మ చేయకుండానే కర్మ చేస్తున్నాను అనే భావన కలిగి ఉండడం.
అనవసరమైన విషయాలు బంధాన్ని కలుగచేస్తాయి. ఏ కర్మ మనకి చుట్టుకుంటుందో అక్కడ మన పాత్ర తప్పక వుంటుంది. నీవు చేసే భోజనం నిన్ను బంధించదు, ఆ భోజనం చేయడానికి నీవు చూపే ఉత్సాహం నిన్ను బంధిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి