16, సెప్టెంబర్ 2020, బుధవారం

*మృత్తికా ప్రసాదం*

మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .దీన్ని వెంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.

ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం చేయాలి. ఇక్కడ చూద్దాం

మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.

ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.

మృత్తికా ప్రసాద వివరాలు.

01. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

02. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరిఅతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

03. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్తానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

కామెంట్‌లు లేవు: