16, సెప్టెంబర్ 2020, బుధవారం

*🌹శుభోదయ సుభాషితమ్🌹*



*శ్లోIIజాడ్యం ధియో హరతి*
*సిఞ్చతి వాచి సత్యం*
*మానోన్నతిం దిశతి పాప మపాకరోతి౹*
*చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం*
*సత్సఙ్గతిః కథయ కిం న కరోతి పుంసామ్౹౹*

భావం:- సత్పురుషుల సహవాసము జనులకు సత్యవాక్కులను గూర్చును. బుద్ధిమాంద్యమును తొలగించును. గౌరవము కలిగించును. పాపమును నశింపజేయును. కీర్తిని దెలుపును. బుద్ధిని వికసింపజేయును. సత్సంగము సకల కార్యముల సాధించును.

అందుచేత సజ్జన సాంగత్యం ఎప్పుడూ అవసరమే. ఎవరు సజ్జనులో ఎవరు కాదో తెలుసుకోవటం లోనే మన తెలివితేటలని బాగా ఉపయోగించుకోవాలి.
🙏🙏🙏

కామెంట్‌లు లేవు: