16, సెప్టెంబర్ 2020, బుధవారం

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు గానం చేయాలని

ఐక్యరాజ్య సమితి 50 వ వార్షికోత్సవ సందర్భంగా  శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు
గానం చేయాలని  ఆమెను ప్రత్యేక అథితి  గా ఆహ్వానించినారు.
వెంటనే  కంచి పరమాచార్యుల వారికి విషయం తెలిపి
వారి ఆశీస్సులు పొందడానికి  స్వామిని దర్శించారు.
కంచి పరమాచార్య జగద్గురు చంద్రశేఖర సరస్వతి
గారు ఆశీర్వదిస్తూ,  వెంటనే  సంస్కృతంలో ‘మైత్రీమ్‌ భజతా’ అనే భక్తి గీతాన్ని రచించి
ఆ గీతాన్ని  పాడమన్నారు.
మైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీం
ఆత్మవదేవ పరాన్నపి పశ్యత
యుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజత
త్యజత పరేషు అక్రమాక్రమణం!!
జననీ పృథివీ కామదుఘాస్తే
జనకో దేవః సకల దయాళుః
'దామ్యత, దత్త, దయధ్వం' జనతాః
శ్రేయో భూయాత్ సకల జనానాం!!

భావం
"అందరి హృదయాలనీ జయించే ’మైత్రి’ని మనం స్వీకరించాలి. ఇతరుల్ని ’మన’లాగే చూడాలి.
యుద్ధాన్నీ, స్పర్థనీ, అక్రమమైన ఆక్రమణలని విడనాడాలి. అన్ని కోరికలూ తీర్చే ఈ భూమి మన తల్లి. సర్వేశ్వరుడు, దయామయుడు భగవంతుడే మన తండ్రి.
దామ్యత -నిగ్రహణ కావాలి.
దత్త’-అవసరంలో ఉన్నవారిని ఆదుకొనేలా సహాయాన్ని అందించాలి.
’దయధ్వం- సానుభూతితో కూడిన సహకారభావమే ’దయ’, దానిని చూపించాలి
ఈమూడు ’ద’కారాలు కావాలి.
సకల జనములకు శ్రేయస్సు కలగాలి".
ఇంకో విషమేమంటే
ప్రముఖ అమెరికన్ రచయిత TS ఇలియట్
తన కావ్యం "waste land" లో
What the thunder said అనే పద్యం లో కూడా స్వామి చెప్పిన పై మూడు విషయాలనే చర్చించారు
పద్యం చివరలో ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
అని ముగించారు.

కామెంట్‌లు లేవు: