.
అక్టోబర్ 2వ తేదీ అంటే చాలా మందికి గాంధీ జయంతి మాత్రమే అని చాలా మందికి తెలుసు. కానీ ఎక్కువ మందికి తెలియని విషయం ఏమిటంటే అదే రోజు మరో ముఖ్యనాయకుడి జయంతి కూడా. ఆయనెవరో కాదు భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా పనిచేశారు.
అయినా ఇంకా గుర్తుకు రాలేదా. ఆయన ఎవరో కాదు లాల్ బహుదూర్ శాస్త్రి. ఈయన 1904 అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జన్మించాడు. ఈ సందర్భంగా లాల్ బహుదూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.
‘జై జవాన్.. జై కిసాన్..‘
‘జై జవాన్.. జై కిసాన్‘ అనే నినాదంతో లాల్ బహుదూర్ శాస్త్రి మన దేశంలో ఒక్కసారిగా వెలుగులోకొచ్చారు. దేశంలో ఐక్యత ఆలోచనపై తన దృష్టిని కేంద్రీకరించిన ఆయన ‘సైనికుడిని అభినందించండి.. రైతును అభినందించండి‘‘ అని భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అసాధారణమైన సంకల్ప శక్తిని కలిగి ఉన్న అత్యంత బలమైన నాయకులలో ఆయన ఒకరిగా నిలిచారు. గాంధీతో పాటు ఆయన కూడా దేశానికి ఎంతో సేవ చేశాడు. అంతేకాదు ఆయన తెచ్చిన నినాదం ఇప్పటికీ అందరినీ ఆకర్షిస్తోంది.
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా..
లాల్ బహుదూర్ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. అంతేకాదు అతని ఇంటిపేరును సైతం వదలాలని నిర్ణయించుకున్నాడు. అంతకుముందు తను ఉన్నత చదువులు చదివేందుకు చాలా కష్టపడ్డాడు. గంగా నదిలో రోజుకు రెండుసార్లు ఈత కొట్టుకుంటూ వెళ్లాడు. పడవలో వెళ్లేందుకు తగినంత డబ్బు తనతో లేనందున తన పుస్తకాలను తలపై కట్టుకుని ఈదుకుంటూ పాఠశాలకు వెళ్లేవాడు. స్వాతంత్య్రం రాకముందు లెనిన్, రస్సెల్, మార్క్స్ పుస్తకాలను చదివేవాడు.
1915లో కీలక మలుపు..
లాల్ బహుదూర్ జీవితాన్ని 1915 సంవత్సరం కీలకమలుపు తిప్పింది. అప్పటి నుండే ఆయన భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనేందుకు కారణమైంది. అలా 1921లో గాంధీజీతో కలిసి సహకారేతర ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన జైలు పాలయ్యాడు. కానీ అప్పటికీ అతను మైనర్ అయినందున అతన్ని విడిచి పెట్టారు. ఆ తర్వాత 1928లో లలితా దేవిని వివాహం చేసుకున్నాడు.
అలహాబాద్ అధ్యక్షుడిగా..
తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన 1930 తర్వాత అలహాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎంపికయ్యారు. అప్పుడే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు లాల్ రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఇక మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆయన పార్లమెంట్ కార్యదర్శిగా పని చేశారు.. రవాణ మంత్రిగా కూడా పని చేసిన ఆయన జనం ఆందోళన సమయంలో లాఠీఛార్జీకి బదులుగా జెట్ వాటర్ చల్లడం అనే నియమాన్ని ప్రవేశపెట్టారు.
1961లో హోం మంత్రిగా..
1957లో రవాణా మరియు సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ప్రధాని తర్వాత ముఖ్యమైన పదవిని 1961లో చేపట్టారు. అప్పుడే ఆయన హోంమంత్రిగా ఎంపికై అనంతరం అవినీతి నివారణపై మొట్టమొదట కమిటీని ప్రవేశపెట్టారు.
పాల ఉత్పత్తికి మద్దతు..
మన దేశంలో పాల ఉత్పత్తిని పెంచే దేశవ్యాప్త ప్రచారమైన వైట్ రివల్యూషన్ ప్రోత్సాహానికి ఆయన మద్దతు ఇచ్చారు. అంతేకాదు జాతీయ పాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేశారు. గుజరాత్ లోసి ఆనంద్ వద్ద ఉన్న అముల్ పాల సహకారానికి కూడా మద్దతు ఇచ్చాడు. భారతదేశంలో ఆహార ఉత్పత్తిని పెంచడానికి మరియు హరిత విప్లవం యొక్క ఆలోచనను కూడా ప్రారంభించాడు. భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ముగించడానికి 1965 జనవరి 10న పాకిస్థాన్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్తో తాష్కెంట్ ప్రకటనపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన 1966లో జనవరి 11వ తేదీ ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంటులో గుండెపోటు వచ్చి మరణించారు.
క్రమశిక్షణ మరియు ఐక్య చర్యలే..
‘‘ క్రమశిక్షణ మరియు ఐక్య చర్యలే దేశానికి బలం. అంతేకాదు నిజమైన మూలం‘‘
వలసవాదం మరియు సామ్రాజ్యవాదం..
‘‘వలసవాదం మరియు సామ్రాజ్యవాదం యొక్క ముగింపునకు మద్దతు ఇవ్వడం మా నైతిక విధిగా మేము భావిస్తాం. తద్వారా ప్రతిచోటా ప్రజలు తమ విధిని రూపొందించుకోవచ్చు‘‘.
జాతి, రంగు లేదా మతం..
‘‘ఒక వ్యక్తిగా మనిషి యొక్క గౌరవం, అతని జాతి, రంగు లేదా మతం, మరియు మంచి, సంపూర్ణమైన మరియు ధనిక జీవితానికి అతని హక్కును మేము నమ్ముతున్నాం‘‘
మీ మార్గం సూటిగా..
‘‘ మీ మార్గం సూటిగా మరియు స్పష్టంగా ఉంది. అందరికీ స్వేచ్ఛ మరియు శ్రేయస్సుతో ఇంట్లో సోషలిస్టు ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించడం మరియు ప్రపంచ శాంతి మరియు విదేశాలలో ఉన్న అన్ని దేశాలతో స్నేహాన్ని కాపాడుకోవడం‘‘
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి