*శ్లో:- ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే ౹*
*నారీ గృహద్వారి, జనా శ్శ్మశానే ౹*
*దేహా శ్చితాయాం, పరలోక మార్గే ౹*
*ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః ౹౹*
సంపద యింటిలో , పశుల
సంపద లెల్లను గోష్టమందునన్ ,
యింపగు భార్య గుమ్మమున ,
యెల్లరు బంధులు ప్రేత భూమినిన్ ,
సొంపగు కాయమగ్నియును
జొచ్చు , నినేవియు వెంటరావు , తా
నింపిన ధర్మమే కలసి
నిల్చును తోడుగ జీవు నెల్లెడన్
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి